సునంద భాషితం ;-వురిమళ్ల సునంద ఖమ్మం
 సంతమము... సంతసము
*****
".,..తమసోమా జ్యోతిర్గమయ" ..ఈ శ్లోకం యొక్క అర్థం చీకటి నుండి వెలుగు వైపుగా  సాగిపోవడం."
బాధలు, వేదనల సంతమము నుండి సంతసమనే వెలుగులోకి ఎల్లప్పుడూ పయనించాలి.
సంతమము మనసుకు కమ్మినపుడు సాధించాల్సినవెన్నో మరుగున పడతాయి.అలాంటప్పుడే  సంతసమునకు సంబంధించిన జ్ఞాపకాలను గుర్తుకు తెచ్చుకోవాలి. భవిష్యత్తుకు దిశానిర్దేశం చేసే ఓ చిన్న ఆశాదీపం లోలోపల వెలిగించుకోవాలి.
అప్పుడే సంతమము పటాపంచలై సంతసము వెల్లివిరుస్తుంది.
 సంతమము అంటే ఏమిటో ఈపాటికి అర్థమై వుంటుంది.
సంతమము అంటే కటిక చీకటి,గబ్బు చీకటి,శార్వరము,చిమ్మన చీకటి,సంతమసము అనే అర్థాలు ఉన్నాయి.
సంతసము అంటే అందరికీ అర్థం తెలుసు. సంతోషము,ఆహ్లాదము,ఎలమి, ప్రీతి,వేడుక,తుష్టి, తృప్తి,హృషి,ఉత్థానము, సంతృప్తి,తోషణము,ప్రమోదము లాంటి అర్థాలు ఉన్నాయి.
బలహీన పరిచే సంతమమును ఎప్పటికప్పుడు వదిలించుకుందాం.
 సంతసము సగం బలమే కాదు పూర్తి బలం ఇచ్చేలా ప్రమోదకరమైన మంచి పనులు చేద్దాం. 
ప్రభాత కిరణాల నమస్సులతో 🙏

కామెంట్‌లు