ఎప్పుడో..... !(చిత్రకవిత)--కోరాడ నరసింహా రావు.
మనిషి తనచేతల్తో.... 
  భూమ్యాకాశాలే కాదు... 
    పాతాళాన్నీ విడిచిపెట్టక....
   విస్తరించేసాడు.... !

తనపరిధుల్లో అన్నింటినీ.... 
.. పరిమితం చేసేసాడు... !
మనిషి మేధోవికాసం ముందు 
కేవలం ఒక్క విమానమేకాదు 
సృష్ఠి సమస్తమూ చిన్నదై      
పోతోంది... !

వైజ్ఞానికంగా అంత ఎదిగిన మనిషి.... నైతికంగా ఎందుకింత పతనమైపోయాడో 

యే ఉన్నతికైనా..... నైతికతే 
పునాది అని, ఎందుకు తెలుసు కోలేకపోతున్నాడు... !

అందుకేనా... ఇన్నిన్ని ప్రమా దాలకు లోనౌతున్నాడు !!
 
ఆ  సత్యాన్ని  ఈ మనిషి 
.  తెలుసుకునే దెన్నడో...., 
 తన అభ్యున్నతికి... బలమైన నైతిక పునాది వేసుకునే దెప్పుడో... !!
      *****

కామెంట్‌లు