ప్రక్రియ : మ గుణింతం బాలగేయం
* * * * * ** *
మ నమంతా ఒక్కటే భారతీయులం
మా టపాట ఐక్యతగా పల్కువారలం
మి న్నయైన చదువుల్లో మేటివారలం
మీ రనట్టి నిజాయితీ బాటసారులం
ము చ్చటైన తెలుగుభాష మెరుగుపెట్టుతాం
మూలమైన పాఠాలను అప్పజెప్పుతాం
మృదువైనది మాతృభాష అని చాటుతాం
మె ప్పు కొరకు తప్పుబాట మేం సాగము
మే లుచేయు వారినిక మరువబోము
మై దానంలో ఆటలు ఆరోగ్యము
మొ ద్దులాగ కూర్చుంటే అనారోగ్యము
మో సకారులకి దూరంగా ఉండవలెను
మౌన మెపుడు జ్ఞానమని యెరుగవలెను
మంచివారి స్నేహమును చేయరండీ
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి