ఏ ఎ న్నార్... ఎన్ టీ ఆర్....
ఏలుతున్న రోజులలో...
వెండితెరకు పరిచయమై...
అనుకరణ - అనుసరణలు
లేని అపూర్వ నీ నటనతో...
ప్రేక్షకుల మదినిఁదోచి....
నీ ప్రత్యేకత చాటినావు !
గూఢచారి 116....మోసగాళ్లకు
మోసగాడు వంటి చిత్రాలతో
క్రొత్తదనం తెచ్చినావు.... !
తొట్టతొలుత తెలుగు సినిమా
రంగులలో చూపినావు !
చిన్నతెరలోని సినిమాను, పెద్దతెరలో చూపిన ఘనత తొలుత నీదెనోయి.... !!
నిర్మాతగ ఎన్నొ మంచి...
చిత్రాలనే తీసినావు !
,సినీ పరిశ్రమలో దిగ్గజాలతో దీటుగ నిలిచి గెలిచినావయ్యా
అల్లూరిసీతారామరాజువై నీవు
అశేష ప్రేక్షకుల మన్నన లందిన
ఘనుడవయ్యా నీవు... !
నరేష్ తో పాటుగా....
మహేష్ వంటి నటరత్నాలను
వారసత్వముగా,తెలుగుతెరకు
అందించి నావయా.... !
బ్రతికినన్నాల్లూ ధైర్య,సాహసా లే ఊపిరిగా బ్రతికిన ధీరుడ వయ్యా.... !
కళారంగమునకే గాక సేవా రంగములోనూ, నీఉనికిని చాటుకున్న ...ఉత్తమ వ్యక్తిత్వ మయ్య నీది... !
నిండు జీవితమును, పరిపూర్ణ ముగా జీవించి... నీ ఖ్యాతిని భువిని వీడి, దివికేగి పోయి నావ.... !
వెండితెర పైనే గాక.... నీలి గగనమున కూడ తారవై మెరియుదువు, తెలుగు సినీ జగతి ఉన్నంత దాక... !
అందుకొనుమయ్య...నా అక్షర
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి