గుళిక;-" రసస్రవంతి " & " కావ్యసుధ " హైదరాబాద్
సహజంగా ఆమె విష గుళిక
సమాజంలో విషముష్టి ఫలమొలక
ఆమె నిలువెల్లా అలంకారమే
అంతరంగము నిండా అహంకారమే

అందానికి అనురాగానికి
పరువాల సోయగానికి
మగవాళ్ళంతా దాసోహమే                                                         
మానసాలలో మాత్రం వ్యామోహమే

ఆమెలో ఆకర్షణ శక్తి ఉంది
ఆమెలో మోహసక్తి ఉంది
అనుకువతో పలుకరిస్తుంది
అమృతాన్ని చిలకరిస్తుంది

మీకు ఎక్కడనైనా తటస్తిస్తే
మీరు తటస్తంగానే ఉండండి
తప్పనిసరి పరిస్థితిలో.....
పక్కకు తప్పుకోండి !
మీరు ప్రేమ గోతిలో పడిపోతారు
చివరకు చిప్పను చేతపడుతారు.


కామెంట్‌లు