చిక్కని చీకటి పరదాలను
ఒక్కటొక్కటిగా ఒడుపుగా
తొలగిస్తూ తొంగి చూసే
తొలి వేకువ కిరణాలు.....
గుప్పెడంత గుండె
రేయంతా చేసిన
ఆశా నిరాశల మధ్యన
నిశ్శబ్ద పోరాటంముగిసి
వెలుగులతో అలికేసి
మనసు ముంగిట
ఆశల రంగవల్లులు
దిద్దే వెలుగు రేఖలు
పడమటి సంద్రాన
మునిగిన వెలుగుబంతి
తూరుపున లేచి తల విదిలిస్తే
ఎగసిపడ్డ వెలువురవ్వలు
పరచుకున్న వెలుగు
పుడమికి మొత్తం
పుత్తడి రజను అద్దేసి
పచ్చదనానికి నగిషీలు చెక్కింది
కొత్త మలుపులు తెస్తూ
మరో అవకాశం ఇస్తూ
కోటి ఆశలు మోస్తూ
వస్తున్న కొంగొత్త ఉదయానికి
🌸🌸 సుప్రభాతం 🌸🌸
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి