క్రమబద్ధం;- కొప్పరపు తాయారుల- మదనపల్లె అన్నమయ్య జిల్లా
         సూర్యుడు గతి తప్పక      
         నడుపుతాడు తన పరిక్రమక్రమబద్ధం
        చంద్రుడు అను సరిస్తాడు రవిని  
   ‌. ‌.  సృష్టి అంతయు నియమంతో
       నిర్విరామంగా నడుస్తుంది
        లక్షణమైన చైతన్యంతో ,!!!

         ఒక అపస్వరం పాట రాగాన్ని
      ‌. రూపునీ  వరవడిని మార్చి
        హత్య చేస్తుంది పూర్తిగా 
        అందుకే నియమ బద్ధమైన
        ప్రతీ కార్యం , ఒక  శా‍స్త్ర
        పరిజ్ఞానం !!!

        కాలగతులు మారకుంటే
        మనిషి బ్రతుకు మారదు
        కాలగతి క్రమము తప్పితే
        బ్రతుకే మారణ హోమం!!! 

        ప్రకృతి కైన జీవితా‌ని కైన
        జీవనాని కైన  కవనాని కైన
        నిబద్ధత  నిత్యావసరం
        తప్ప కూడదు గతి,,!!

        పాటకు ప్రాణం లయ
        లయ తప్పితే పాటకు
        మరణమే,
       నియమం జీవితానికి ఒక
        ఆశీర్వాదం!!

        ఆచరించాలి  క్రమపద్ధతిలో
        నిబద్ధతతో  మనసు పెట్టి
        అప్పుడే ప్రతీ ఒక్కరూ విజయకేతనం
        ప్రగతిపథంలో నాటవచ్చు అలరించవచ్చు!  


కామెంట్‌లు