పోటీ ;-- డా.గౌరవరాజు సతీష్ కుమార్.

 చైత్రమాసం వచ్చింది 
గున్నమావి పూసింది
కోయిల వచ్చి కూసింది
మాపాప ఆకూత విన్నది 
మాపాప కోయిలలా కూసింది 
ఇద్దరు పోటీ పడ్డారు
"కో" అంటే ''కో" అని పాడారు 
కోయిల కాసేపు కూసింది 
చాలా అలసిపోయింది
పంతం వదలక మాపాప
"కో" అంటూనే వున్నది 
చిలిపిగ కూస్తూ వున్నది
కోయిల ఎగిరి పోయింది
మాపాప పోటీ గెలిచింది
కోయిల పోటీ ఓడింది !!

కామెంట్‌లు