మదర్ థెరిసా (సమ్మోహనాలు )--ఎం. వి. ఉమాదేవి
ఆగ్నస్ బొజాక్షువా 
బొజాక్షువ నీవా 
నీవుసేవకురాలు  నిర్మలత ఓ మదర్ !!

ఏనాటి బంధమో 
బంధమగు చందమో 
చందమామగ దీన హృదయాల కో మదర్ !!

దీనజన ఆశ్రయము 
ఆశ్రయం అద్భుతము 
అద్భుతం రోగులకి స్వస్థతగ ఓ మదర్ !!

అనాథల దేవతవు 
దేవ సంకల్పమువు 
సంకల్ప దీక్షలో సరిలేరు ఓ మదర్ !!

విద్య ఆహారాలు 
ఆహార వైద్యములు 
వైద్యమే బడుగులకు చేయించె ఓమదర్ !!


కామెంట్‌లు