బాలగేయం;-  సత్యవాణి
 ఉసిరి చెట్టు మీదకు
ఉడుత ఎక్కింది
ఉసిరికాయలనేమొ
ఉడుత చూసింది
ఊరింది నోరేమొ
ఉడుతమ్మ కపుడు
కొరికింది ఉడుతమ్మ
కసరు కాయొకటి
పళ్ళన్ని పులవగా
పారవేసింది
అబ్బబ్బ పులుపంటు
అరచింది ఉడుత
          

కామెంట్‌లు