మొక్కుబడిపనులు;- సత్యవాణి
 వగలాడి వంటచేస్తే
విందుకుడిచినవారికి
వికారపెట్టిందట
అలావుంటాయి మొక్కుబడిపనులు
పనివాడు పందిరేస్తే
పిచుకలు పడదోస్తాయట
అలా వుంటాయి మొక్కుబడిపనులు
ఏడుస్తూ వ్యవసాయంచేస్తే
కాడీ ఎద్దులను దొంగలు
తోలుకెళ్ళారటఅలావుంటాయి         
మొక్కుబడిపనులు
తిక్కలరాయుళ్ళు చేసే
మొక్కుబడిపనులు
చిక్కులు తెచ్చిపెడతాయి
చుక్కలు చూపిస్తాయి
           

కామెంట్‌లు