ఆరోగ్య పద్యాలు ; సత్యవాణి
అల్లమారితేరి యైనది శొంఠిగా
మేలు గుణము లందు మెండుగలవు
శుధ్ధి జేయు కడుపు శోధించు రోగంబు
నౌషధంబు గాను నందివచ్చు

వాము జీలకర్ర వంటింటి యౌషధుల్
 చేయుమేలు నిదని చెప్పగలమె
గదులపెట్టె నుండుఘనమగు వైద్యుడు
రోగ మదుపు జేయు వేగముగను

 నల్లమిరియమందు కొల్లలు మేలులు
నింట యిదియు నున్న  తంటలేదు
మిరప కాయ బదులు మిరియము
వాడగా
కలుగు మనకు మేలు ఖచ్చితముగ

 అల్లమారితేరి యైనది శొంఠిగా
మేలు గుణము లందు మెండుగలవు
శుధ్ధి జేయు కడుపు శోధించు రోగంబు
నౌషధంబు గాను నందివచ్చు
   
వాము జీలకర్ర            వంటింటి యౌషధుల్
 చేయుమేలునవియు చెప్పతరమ
గదులపెట్టె నుండుఘనమగు వైద్యులు
రోగ మదుపు జేయు వేగముగను
 
 ఆవగంజ జూడ యంతంత మాత్రమె
చిట్టి గింజ గాని జేర్చు రుచియు
కందకూర కండ కాగలదాగింజ
కూర బులుసు లందు గూడియుండు

 ధనియ మింట యున్న ధైర్యంబు  మనకును
చలువ గుణము గలది జాలినంత
వాత పైత్య హరము వారించు రోగము
కొత్తీమీర యగును కూడి నేల

 విడుము పంచదార విషమట తినగను
ముప్పు తెచ్చునదియు దప్పకుండ
కలవు దానియందు ఖనిజముమెండుగా 
తెల్ల విషము విడుము తెలివి గలిగి

మెంతి చేయు మేలు నెంతని చెప్పను
కాంతులీను మేను కంటి చలువ
సుగరు నదుపు నుంచు చుండ్రును పోగొట్టు
కడుపు నందు పురుగు గలుగనీదు


కామెంట్‌లు