అవినీతి సొమ్మంతా గుంజి...
తెచ్చేసిన...,అభివృద్ధి పధంలో
పయనించమా మనం !
చక్కనిరోడ్డులు, డ్రైనేజీలతో...
ఊళ్లు కళకళ లాడి...
పరిశుభ్రతతో ఆరోగ్యమే...
చేకూరదా మనకు !
పేదరికమేపోయి...కూడుగుడ్డలతో...
సొంతగూటిలోహాయిగా... ఉండమా మనం !
పట్టుబడుతున్న బంగారం...!
దాడుల్లో దొరుకుతున్న
.... కోటానుకోట్ల ధనం !!
ఏమైపోతుందో... ఎవరికెరుక
లక్షలెన్నో మూల్గుతూ ఉన్నా...
కోట్లకొరకు పరుగులుతీసే...
ఆశబోతుల ఆట కట్టించాలి !
దేశ ప్రజలంత హాయిగా...
బ్రతుకు గడపాలి !!
********
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి