అభినుతి...అభిమతి
*****
పిల్లలకైనా,పెద్దలకైనా అభినుతి అనేది మరింత ప్రోత్సాహాన్ని ఇస్తుంది.
కాబట్టి కేవలము ఇష్టమైన వారిని అభినుతించడమే కాదు,ఎవరు ఏ మంచిపని చేసినా వారిని అభినుతించడం మానవీయ వ్యక్తిత్వ లక్షణం.
అభినుతి అంటే ఏమేమి అర్థాలున్నాయో తెలుసుకుందాం....స్తుతి,పొగడ్త,కీర్తనము,ప్రణుతి, ప్రణవము,శ్లాఘము,ప్రస్తుతి,మెచ్చు, ప్రశంస మొదలైన అర్థాలు ఉన్నాయి.
గొప్ప పనులు చేసేవారిని అభినుతించడమే కాకుండా వారి పట్ల అభిమతి కలిగి ఉండాలి.సమాజ శ్రేయస్సు కోసం తపించే వ్యక్తులను అభిమతించడం అనేది సమాజంలో సహజంగా చూస్తూ ఉంటాం.
వారిలా ప్రతి వారూ ఇతరుల అభిమతి పొందేలా నడవడికను తీర్చిదిద్దుకోవాలి.
మరి అభిమతి అంటే ఏమిటో చూద్దాం.... *అభిమానము,అనురాగము,ఇష్టము, ఆత్మ గౌరవము, మమకారము, ప్రీతి, సౌజన్యము,మక్కువ, స్నేహము లాంటి అనేక అర్థాలు ఉన్నాయి.
అభిమతి మన మన వ్యక్తిత్వానికి సూచిక.అభినుతి మనల్ని అభిమానిస్తూ ఇచ్చే కానుక.
ప్రభాత కిరణాల నమస్సులతో 🙏

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి