రుణం!!?--ప్రతాప్ కౌటిళ్యా
ఆ పైవాడిచ్చేది
ఈ కింది వాడిచ్చేది
ఏదైనా తీసుకో
నీవేం వాడికి బాకీ పడవు!!

వాడికి చెందిన
ప్రతిదీ నీకు చెందుతుంది!!

ఇక్కడ ప్రతిదీ అందరికీ
సమానంగా అంది తీరుతుంది!!
ఎవరు ఎవరికి రుణపడరు!!!?

ఇక్కడ ఆది కోరికలు
ఆఖరి కోరికలు ఉండవు
అందరి కోరికలు తీర్చబడతాయి!!
ఎవరు ఎవరికీ రుణపడరు!!?

ఆనందం సంతోషం
అధికారం ధనం
ఎవరో ఒకరి సొత్తు కాదు!!
అందరికీ సమానంగా పంచిపెట్టబడుతుంది!!?

ఎవరు ఎవరికీ రుణపడి ఉండరు
ఇక్కడ ప్రతిదీ అందరికీ
సమానంగా అంది తీరుతుంది!!?

తెలివితేటలు
ఎవరో ఒకరి సొత్తు కానట్లు
ఇక్కడ

జ్ఞానం విజ్ఞానం
అందరికీ సమానంగా పంచబడుతుంది!!
ఎవరు ఎవరికీ రుణపడి ఉండరు!!?

ఈ భూమి ఈ గాలి ఈ నీరు
ఎవరో ఒకరి సొత్తు కాదు
ఇక్కడ

ప్రతిదీ అందరికీ సమానంగా అందితీరుతుంది!!
ఎవరు ఎవరికి రుణపడి ఉండరు!!!?

ఆ పైవాడిచ్చేది
ఈ క్రింది వాడిచ్చేది
ఏదైనా తీసుకో
నీవు వాడికి రుణపడీ ఉండవు!!!?

Pratapkoutilya lecturer in Bio-Chem palem nagarkurnool dist 🙏
8309529273

కామెంట్‌లు