కళింగ మాస పత్రిక వ్యాస రచనల పోటీ
 తపస్వి మనోహరం అంతర్జాల పత్రికకి అనుబంధంగా,  జనవరి , 2023 నుండి ప్రారంభం కాబోయే కళింగ మాస పత్రిక కోసం వ్యాస రచనల పోటీని  నిర్వహిస్తున్నాము.
                  ఈ పోటీ కేవలం శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లా, పార్వతీపురం మన్నెం జిల్లాల రచయిత(త్రి)లకు  మాత్రమే.
పోటీ అంశాలు:-
              రాజకీయ అంశాలు (దేశ రాజకీయ స్థితిగతులు ఇత్యాది),  ఆర్థిక అంశాలు (నేటి ఆర్థిక పరిస్థితులు ఇత్యాది), సామాజికపరమైన అంశాలు.
           
         
బహుమతుల వివరాలు:-
           గెలుపొందిన ఒక్కొక్కరికి రూ. 200/- నగదు బహుమతి ఇవ్వబడుతుంది. 
              పాల్గొన్న ప్రతి ఒక్కరికి డిజిటల్ సర్టిఫికెట్ ఇవ్వబడుతుంది. 
         వచ్చిన రచనలను మాస పత్రికలో సాధారణ ప్రచురణ నిమిత్తం స్వీకరించడం జరుగుతుంది. 
             పోటీ మొదలయ్యే తేదీ:-18-11-2022
             పోటీ ముగిసే తేదీ:-18-12-2022
ఫలితాలు:-కళింగ మాస పత్రికలోనూ ,తపస్వి మనోహరం వెబ్సైట్ లోనూ చూడగలరు.
నిబంధనలు :-
       మీ వ్యాసం 1500 పదాలకు మించకూడదు.
        
       మీరు పంపే రచనలు ఎక్కడా ప్రచురితం కాలేదని,అనుసరణ,అనుకరణ కాదనీ, ఏ పోటీకి పంపలేదని  హామీ పత్రం జతచేయాలి. 
రాత  ప్రతులు,pdfలు రాసివాటి ఫోటోలు స్వీకరింపబడవు .
అక్షర దోషాలు రాకుండా చూసుకోవాలి. 
  తుది నిర్ణయం పత్రిక యాజమాన్యం వారిదే. ఎటువంటి వివాదాలకు తావులేదు. 

పోటీకి రచనలు పంపవలసిన చిరునామా:-
   ఫోన్ నంబర్లు:-7893467516,8639380622
మెయిల్ ఐడి:- kalingathapasvi@gmail.com

కామెంట్‌లు