అమాయకుడు! అచ్యుతుని రాజ్యశ్రీ

 బాబు బుద్ధి వికసించని అమాయకుడు.ఐదేళ్ల లోపు పిల్లల తెలివి ఆతనిది.పాతికేళ్ల కొడుకు గురించి దిగులు పడేవారు అమ్మా నాన్న లు. ఓరోజు దూడ తాడుని విప్పి అది గేదె దగ్గర పాలు తాగుతుంటే చప్పట్లు కొడుతూ ఆనందం గా గంతులేస్తూ ఉంటే తండ్రి కోపంతో తిట్టాడు "వెధవా!పాలన్నీ దూడ తాగేస్తే మనకు పాలు పెరుగు ఎలా ఉంటాయి?నాపాల వ్యాపారం  అటకెక్కుతుంది." అంతే ఆరోజు తల్లి బతిమాలినా అన్నం తినలేదు. అమ్మా నాన్న నిద్రపోతుంటే నెమ్మదిగా ఇంట్లోంచి బైటకి జారుకున్నా డు.అలా గుట్టలవైపు నడుస్తూ చెట్టుకింద నిద్రపోయాడు.ఆసాయంత్రం చీకటి పడుతుండగా అటుగా వెళ్తున్న ఓసాధువు చూశాడు.బుజ్జగిస్తూ వివరాలు అడిగాడు. "మానాన్న తిట్టాడు. "అని భోరున ఏడుస్తున్న వాడిని తన కుటీరం లోకి తీసుకుని వెళ్లి పాలు పళ్ళు పెట్టి " నీమంచి కోసమే వారు తిట్టారు" అని కబుర్లలోకి దింపాడు.తెల్లారింది.బాబుకి తన ఇల్లు ఎక్కడ ఉందో తెలీదు. ఊరుపేరు తెలీదు. వాడికి లేత ఎండలో యోగాసనాలు నేర్పాడు.తోటపని చేయించాడు.రెండు రోజులు గడిచాయి. బాబుని వెంటబెట్టుకొని ఆదగ్గరలో ఉన్న పల్లెవైపు సాగాడు."మీఅమ్మ నాన్న  ఇక్కడ ఉంటారా?ఇక్కడ ఉందా మీఇల్లు?" సాధువు కి వాడు  ఏమీచెప్పలేకపోతున్నాడు.అలా చుట్టుపక్కల తిప్పసాగాడు.కొడుకు కోసం బాబు అమ్మా నాన్న లు కొందరు ఊరివాళ్ళతో గాలిస్తున్నారు. అదృష్టవశాత్తు బాబు అటుగా వచ్చిన అమ్మని చూసి గట్టిగా "అమ్మా!" అని  అరుస్తూ పరుగెత్తాడు.బాబు తల్లి ని పట్టు కుని వలవలా ఏడుస్తూఉంటే ఆమె కూడా "బాబు!ఎక్కడ ఉన్నావురా నాతండ్రీ" అని భోరుమంది.సాధువుతోకల్సి తన ఇంటికి వచ్చిన బాబుని చూసి ఊరివారంతా అడిగారు"ఏంరా? అలా ఎందుకు పోయావు?" ఇంతలో తండ్రి కూడా ఇల్లు చేరాడు.సాధువు బాబునాన్నతో అన్నాడు "వాడి లో మెదడు ఎదగలేదు. బెదిరించటం తిట్టడం వల్ల లాభం లేదు. వాడిలో తెలివిఉంది కాబట్టే  కోపంతో అరవగానే రోషంతో అన్నంకూడా తినకుండా ఇంటినుంచి పారిపోయాడు.బెదిరించి లాభంలేదు. ఎండలో యోగాసనాలు చేయిస్తూ చిన్న చిన్న పనులు చేయించాలి. "అని అమ్మా నాన్నలకు చెప్పాడు.సైకాలజిస్టులు సైక్రియాటిస్టులు నేడు బుద్ధి మాంద్యం ఐ.క్యూ.తక్కువ ఉన్న పిల్లలకు శిక్షణ ఇస్తున్నారు. అలాంటి పిల్లలను ఎవరూ హేళన చేయరాదు🌷
కామెంట్‌లు