కొత్తూరు వచ్చా
కొత్తవాళ్ళను చూచా
కొత్తప్రదేశాలు చూచా
కొత్త అందాలనుకన్నా
కొత్త ఉద్యోగంలోచేరా
కొత్త ఇంటిలోదిగా
కొత్తబట్టలు కట్టా
కొత్తకొత్తగా తయారయ్యా
కొత్తమాటలు నేర్చుకున్నా
కొత్తపాటలు విన్నా
కొత్త ఆటలాడా
కొత్త పాటులుపడ్డా
కొత్తపువ్వును చూచా
కొత్తకోరిక కలిగా
కొత్త ఆలోచనలొచ్చా
కొత్త కవితలను వ్రాశా
కొత్త పెళ్ళాం
కొత్త కాపురం
కొత్త అనుభవం
కొత్త జీవితం
కొత్తంత
పండుగలేదు
అల్లుడంత
చుట్టములేదు
కొత్త ఒకవింత
పాత ఒకరోత
కొత్తపాతల మేలుకలయిక
నూతనవొరవడి నాకవిత
గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
కొత్త కలాన్నిపట్టి
కొత్త పుస్తకాన్నికొని
పగలంతా రాస్తా
రాత్రంతా రాస్తా
కొత్తకలంతో గీస్తా
కుడిచేతితో చెక్కుతా
ఇక చాలని అరిచేదాకా
సిరా ఖాళీ అయ్యేదాకా
కలంమంచిది
కమ్మనైనది
కదులుతుంది
కదిలిస్తుంది
నా కలం
నా నేస్తం
నా అదృష్టం
నా కవిత్వం
కలానికి
ధన్యవాదాలు
కవితలకు
స్వాగతాలు
4:58 pm
5:02 pm
కొత్తచోటు కొత్తకలము కొంగొత్తకవిత;-గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
కొత్తూరు వచ్చా కొత్తవాళ్ళను చూచా కొత్తప్రదేశాలు చూచా కొత్త అందాలనుకన్నా కొత్త ఉద్యోగంలోచేరా కొత్త ఇంటిలోదిగా కొత్తబట్టలు కట్టా కొత్తకొత్తగా...
www.molakanews.page
https://www.molakanews.page/2022/11/blog-post_14.html?m=1
5:35 pm
YESTERDAY
తెల్లనివన్ని పాలుకాదు
చూపేది
దైవధ్యానం
చేసేది
కొంగజపం
కనబరచేది
కుక్కవిశ్వాసం
దాచిపెట్టేది
నక్కటక్కరితనం
పైకి
తీపిచూపిస్తారు
లోపల
చేదునుదాస్తారు
బాహ్యాన
లాభమంటారు
అంతరాన
నష్టపరుస్తారు
పలుకులలో
ఇష్టంచూపిస్తారు
పనులలో
కష్టంకలిగిస్తారు
నటించి
నమ్మబలుకుతారు
ఉపక్రమించి
ఉపద్రవంచేస్తారు
ధర్మాత్మునిగా
కనబడతారు
దురాత్మునిగా
దుర్మార్గాలుచేస్తారు
పుణ్యమని
చెబుతారు
పాపాలను
చేస్తారు
పైకేమో
భక్తిముక్తి
లోపలేమో
భుక్తిరక్తి
సాయం
చేస్తామంటారు
మోసం
చేస్తూయుంటారు
పెదవిపై
తేనెపూచుకుంటారు
కడుపులో
విషందాచుకుంటారు
మాటలతో
నమ్మిస్తారు
చేతలతో
ముంచేస్తారు
కళ్ళకుకనిపించేవన్ని
నిజముకాదు
అంతరంగాన్నిదర్శిస్తేగాని
అసలువిషయంబయటపడదు
అన్నివిషయాలు
తెలుసుకోండి
ఆలోచించి
చక్కగామెలగండి
తెల్లనివన్ని
పాలుకాదు
నల్లనివన్ని
నీళ్ళుకాదు
గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
7:43 am
7:43 am
తెల్లనివన్ని పాలుకాదు;-గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
చూపేది దైవధ్యానం చేసేది కొంగజపం కనబరచేది కుక్కవిశ్వాసం దాచిపెట్టేది నక్కటక్కరితనం పైకి తీపిచూపిస్తారు లోపల చేదునుదాస్తారు బాహ్యాన లాభమంటారు ...
www.molakanews.page
https://www.molakanews.page/2022/11/blog-post_341.html?m=1
9:48 am
TODAY
ఇదేమిలోకం?
ఇదేమిలోకం
ఇదేమిలోకం
కళ్ళనిండాద్వేషం
మనుసులనిండాస్వార్ధం
ఇదేమిన్యాయం
ఇదేమిన్యాయం
బలవంతులదేరాజ్యం
ధనవంతులదేపెత్తనం
ఇదేమికష్టం
ఇదేమికష్టం
పనిదొరకటమేకష్టం
కడుపునిండటమేకష్టం
ఇదేమిధర్మం
ఇదేమిధర్మం
కులానికోధర్మం
మతానికోధర్మం
ఇదేమిపక్షపాతం
ఇదేమిపక్షపాతం
ఆడామగామధ్య వ్యత్యాసం
బీదాధనికులమధ్య విచక్షణం
ఇదేమిరాజ్యం
ఇదేమిరాజ్యం
దళారులదేరాజ్యం
దోపిడీదారులదేరాజ్యం
ఇదేమిపాలనం
ఇదేమిపాలనం
నేరస్తులదేపాలనం
ఫిరాయింపుదారులదేపాలనం
ఇదేమిప్రజాస్వామ్యం
ఇదేమిప్రజాస్వామ్యం
డబ్బిచ్చినవాడికే అధికారం
దబాయించినవాడికే ఆధిపత్యం
ఇకకలుద్దాం
ఇకకలుద్దాం
అన్యాయాలను అరికడదాం
అక్రమాలను అంతంచేద్దాం
ఇకలేద్దాం
ఇకలేద్దాం
మనుజులను మార్చేద్దాం
మరోప్రపంచాని సృష్టిద్దాం
అందరమొకటవుదాం
అడుగులుముందుకేద్దాం
పిడికిలి ఎత్తుదాం
పోరాటం చేద్దాం
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి