* అభ్యుదయ మహిళా గీతం *;-- కోరాడ నరసింహా రావు !
సాకీ :-
   ఓ.... ఆడపిల్లా.... !
  అడుగడు వంచనలతో.... 
  ఈ లోకంలో నువ్ బ్రతికే      దెలాతల్లీ..... !!
పల్లవి :-
      నేటి మహిళను నేను.... 
  అన్నిరంగాల ముందున్నాను !
కామాంధ కీచ కులను  జంప 
 ఏ భీముని సాయమూ కోరను 
 భద్ర కాళినే ఔతాను !
  నేను భద్రకాళినే  ఔతాను !!
       " నేటి మహిళను నేను.. "
చరణం :-
.. . కన్యా శుల్కాలు, సతీ సహ గమనాలు... 2
 వరకట్న దురాచారాలు, భ్రూణ 
హత్యలు, అసమానతలు... 
         "కన్యా శుల్కాలు... "
 ఆచార సాంప్ర దాయాలంటూ 
 సంకెళ్ళలోనెఉంచారు...మము
 సంకెళ్ళ లోనె ఉంచారు !
  అణగి-మణగి  ఉన్నన్నాళ్లూ.. 
 రాచిరంపాన పెట్టారు... మము రాచి రంపాన బెట్టారూ... !
  మమ్మణగ ద్రొక్కే ఉంచారు!!
       "నేటి మహిళను నేను... "
చరణం :-
    భరించి -  భరించి భరించలేక
సహించి - సహించి సహించలేక 
 ప్రార్ధించాము -  ప్రశ్నించాము 
.పోరాటా  లెన్నో   చేసాము !
      "ప్రార్ధించాము...... "
చివరకుమేమే గెలిచాము... 2
 విజయులమై నిలిచాము... 
మేమువిజయులమైనిలిచాము 
మేమువిజయులమైనిలిచాము 
*********

కామెంట్‌లు