-గురువు (నానీలు );-ఎం. వి. ఉమాదేవి.
 1)
అక్షరం 
సంధ్య వారుస్తుంది 
అద్భుతమైన 
గురువు మేధోనదిలో !
2)
పాఠాలవిందు 
ప్రేమతో ఇస్తాడు 
ఇంటిపని 
తాంబూలం నవలాలిక!
3)
ఆసక్తికలిగేలా 
చెప్పే  తపన 
మంచిగురువుకి 
అదే నిర్ధారణ !
4)
వేల మందికి 
విద్యాదానం 
అది భుక్తికైనా 
భవ్యమైనదే !
5)
కులమత జాడ్యం 
పట్టుకున్న గురువు 
తులసి వనంలో 
గంజాయిమొక్క !
6)
అతను దరఖాస్తు 
చేసుకోలేదు 
ఉత్తమ పురస్కారం 
గుండెల్లో ఉంది!

కామెంట్‌లు