బహుమతి!!?;-ప్రతాప్ కౌటిళ్యా
నీవు
పగలగొట్టబడిన
మట్టిలోంచి పుట్టిన
అద్దాన్ని నేను!!?

కానీ
నీ ముందు
నిలబడ్డ
విరగొట్టబడని
మట్టిలో కలవ బడని
ఎముకను నేను !!?

నీవు 
పగలగొట్టింది
గుండెను కాదు
గుడ్డి నమ్మకాన్ని!!

కానీ
నీ ముందు నిలబడ్డది
మాంసపు ముద్దలోంచి
పుట్టిన
కత్తి లాంటి ఆలోచన!!?

చెడును
స్వీకరించిన ప్రవృత్తి!!

మంచిని ఇచ్చిన 
వృత్తి!!

అదే ప్రకృతి
మన కిచ్చిన బహుమతి !!?

Pratap koutilya lecturer in Bio-Chem palem nagarkurnool dist 🙏
8309529273

కామెంట్‌లు