* సాక్షాత్ ధరిత్రియే ఆమె ! *(* చిత్రకవిత *)-- కోరాడ నరసింహా రావు.
పురుషునిలో  సగం కాదు...., 
 పరిపూర్ణురాలు స్త్రీ మూర్తి !

ఇంటి పని, వంటపని... 
 బిడ్డలను కని, సంరక్షిస్తూ... పెంచే సమర్ధురాలు ఆమె... !!

కేవలమూ సంపాదించే పురుషు డుఆలిని, సేవకురాలిగచూస్తే...
ఇంటాబయటాతానుసవ్యసాచి యై...జీవన సమరమునే చేస్తూ 
విజయురాలు కాగలదు... !

కార్యేషు.,కరణేషు..,భోజ్యేషు,శయనేషు... మాత్రమే కాదు 
  సర్వంసహా సంపాదనేషు... 
  మహిళామణి.... !

ఐనా... క్షమయా  ధరిత్రియే... 
    ఆమె !🙏💐🙏
     *******

కామెంట్‌లు