* బోధించు చున్నవి *;- కోరాడ నరసింహా రావు !
హంసలు,కలువలతో...కొలను 
అందాన్నిచూడగ...హాయినొంది మది, పరవశమునపులకించు 
చున్నది.... !

కలగలిసిన పాలూ నీళ్లను... 
 వేరుచేసుకు, నీరమును వీడి క్షీరమును గ్రోలు నేర్పరి హంస !

బురదనుండే పుట్టినా... నిరం తరమూ నీటిలోనే యున్నా... 
బురదను అంటించుకోని, నీటి 
తడి కి  చివికిపోని నైజమీ.... 
కలువలు, తామరలది... !!

ప్రాణికోటికంతటికీ ఆధారభూ తమీనిర్మల జల  సరోవరం.... !

సునిశితముగా పరిశీలించిన... 
ప్రకృతి సమస్తమూ... మనిషికి చక్కని  పాఠములను బోధించు చున్నవి ... !
     *******--


కామెంట్‌లు