రుబాయీలు -డాక్టర్ అడిగొప్పుల సదయ్య
నా కన్నుల వెన్నెలవై మెరిసావే ఓలలనా!
నా గుండెన హర్షమువై కురిసావే ఓలలనా!
నా ఆత్మను మురిపించగ ఈ లోకము ఏతెంచియు
నా పెదవుల పుష్పమువై విరిసావే ఓలలనా!

నీ చూపుల తూపులతో ఒరిగానే ఓ లలనా!
నీ ఊర్పుల కొలిమిలోన కరిగానే ఓ లలనా!
నీ పంచన చేరేందుకు సర్వస్వము విడిచిపెట్టి
నీ ముంగిట అంజలితో తరిగానే ఓ లలనా!

డాక్టర్ అడిగొప్పుల సదయ్య
వ్యవస్థాపక అధ్యక్షుడు
మహతీ సాహితీ కవిసంగమం -కరీంనగరం
9963991125

కామెంట్‌లు