చలి పులి ఎన్నిరకాలో ";-చంద్రకళ. Y
బాబోయ్ చలి పులి ఎన్ని రకాలో.. 
మరీ విడ్డూరం అంటారా?
నేను చూసా ఒట్టండి బాబు....

మన వూళ్ళో చలి వేసేస్తే కాస్త దుప్పటి ముసుగు తన్నేస్తే చాలు.
చలి  పారిపోతుంది పిల్లిలా....

ఆలా కొన్నాళ్ళు ఇండోర్ లో వున్నామా!
రాత్రియితే కిటికీలు, తలుపులు మూసేసినా
తలుపుల సన్న సందుల్లో నుండి చలి దెయ్యం లా వచ్చి చుట్టేసి గజగజా వణికించేసేది! 

తెలియక డార్జిలింగ్ సూర్యో
దయానికి ముందే వెళ్ళి... కాంచనజంగా శిఖర దర్శనం కోసం వేచివుంటే...
చలిపులి కరకరా.. ఎముకల్ని కూడా కొరికేస్తుంది నిజమండి!

ఇంక కేదార్ వెళ్ళే దారిలో మంచు కొండ చరియలు ఫెళ, ఫెళ విరిగి పడి భయపెట్టేస్తాయి!
అంతవరకూ వేడిగా వున్న వాతా
వరణం గబగబా మారిపోయి క్షణాల్లో చలిచిరుతలా తరుముకొచ్చి కేకలు పుట్టించేస్తుంది!

మాత వైష్ణవీ దేవి దర్శనానికి వెళితే, అమ్మ వున్న గుహలోకి కాలు పెట్టగానే చల్లని మంచు గాలులు కొంప ముంచేస్తాయి!

చలిగారి విశ్వరూపం  అమెరికాలో  చలి పెద్ద పులిని చూసా....
ఆరునెల్లు మంచులో నే, ముసుగు వీరుల్లా బ్రతకాలి!
మైనస్ డిగ్రీలలో అది కైలాసమే!

మరి చలి పులి చాలా రకాలని వప్పుకోకపోతే, జాగ్రత్త చలిపులి కాపుకాసి వుందం డోయ్ !🤗


కామెంట్‌లు