నాయగనాయ్ నిన్ఱ నన్దగోపనుడైయ
కోయిల్ కాప్పానే,కోడి త్తోన్ఱుమ్ తోరణ
వాశల్ కాప్పానే మణిక్కదవం తాళ్ తిఱవాయ్
ఆయర్ శిఱుమియఱో ముక్కు అరై పరై
మాయన్ మణివణ్ణన్ నెన్నలే వాయ్ నేర్ న్దాన్
తూయోమాయ్ వన్దోమ్ తుయిలెழప్పాడువాన్
వాయాల్ మున్నం మున్నం మాற்றாదే అమ్మా! నీ
నేశ నిలైక్కదవం నీక్కు ఏలో రెంవావాయ్!
తిరుప్పావై ఇష్టపది-16
నాయకాగ్రణి యైన నందగోపుని గొప్ప
శాల గాచెడివాడ! శూల-తోరణ యుక్త
గడప గాచెడివాడ! అడరు మాణిక్యాల
తలుపు తాళము తెరువు; తాలు యెరుగని గొల్ల
బాలలము! మాకు పర వాద్యమును ఇత్తునని
మాయావి,కృష్ణుండు,మణివర్ణదేహుండు
నిన్ననే మాటిచ్చె; చన్నీట నీరాడి
శుచితోడ వచ్చితిమి సుప్రభాతము పాడ;
తొట్టతొల్తనె మమ్ము తొందరగ యాపేసి
వ్రతభంగమును చేయ వద్దు ద్వారస్వామీ!
కరుణించి వాకిలిని తెరిచిలోనికి పంపు!
ఇది మాదు వ్రతమండి! ఇచ్ఛతో చేరండి!!
శాల = గృహము,శూల= ధ్వజము
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి