మా ఆత్మీయుడు భాస్కర్ (5); -ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322.
 ఇక్కడ ప్రత్యేకంగా  కాకాని వెంకటరత్నం గారి మనసుని ప్రస్తావించాలి. ఉక్కు మనిషి అని వారికి పేరు.వారి హృదయం నవనీతం. అతి చిన్న పొరపాటు జరిగినా స్పందించే  తత్వం వారు విద్యాశాఖ మంత్రిగా  ఉన్న సమయంలో ఓ రోజు మా గ్రామానికి మా ఇంటికి వచ్చి  మా నాన్నతో మాట్లాడుతూ  మీ పెద్దబ్బాయి ఏం చేస్తున్నాడు అని అడిగితే ఖాళీగా ఉన్నాడు అని చెప్పారు. అదేంట్రా చదువుకున్నవాడు ఉద్యోగం లేకపోతే ఎలాగ ఉద్యోగం పురుష లక్షణం అన్నారు కదా  అని నాన్నకు తెలియకుండానే  మా అన్నయ్యను మద్రాస్ పంపి శిక్షణ ఇప్పించి మా గ్రామం తేలప్రోలు లో మాస్టర్ గా  ఉద్యోగం ఇప్పించి  అన్నయ్య జీవితాన్ని నిలిపిన మంచి మనసు కలిగిన వ్యక్తి.  మా అన్నదమ్ములం అందరం వారిని బాబాయ్ అనే పిలుస్తాం. అలాంటి  వ్యక్తితో నాకు పరిచయం ఉన్నది అని చెప్పుకోవడం నాకెంతో గర్వకారణం. విశాఖపట్నంలో భారత్ సేవక్ సమాజ్ కార్యక్రమం పూర్తయ్యేంతవరకు  ఉండి అందరిని కంటికి రెప్పలా చూసినవారు కాకాని వారు  ఉదయం  మధ్యాహ్నం సాయంత్రం రాత్రి  పిల్లలకు ఏ ఏ పదార్థాలు చేసి పెడుతున్నారో ప్రతి దానిని  ఆయన పరిశీలించిన తర్వాతనే  వడ్డించేవారు.  వాళ్ళ క్షేమానికి సంక్షేమానికి కృషి చేసిన మహానుభావుడు  అందుకే  భౌతికంగా ఆయన మనలను వదిలి 50 సంవత్సరాలు అంటే అర్ధ శతాబ్ది కావస్తున్నా అందరి హృదయాలలో శాశ్వతంగా నిలిచిపోయిన పేరుకు తగిన రత్నం. వారి గురించి ఎంత చెప్పినా తక్కువే  ఉద్యోగ ధర్మం లో విద్యా వ్యవస్థలో ఎన్ని మార్పులు తీసుకువచ్చారో  అందరికీ తెలుసు. ఆయన అనుకున్నది కాక  ఇతరుల సలహాలను కూడా పాటించి వాటిని కూడా  అమలు చేసిన సమర్థుడు  అందువల్లనే ప్రతి ముఖ్యమంత్రి ఆయన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటారు. ఒకసారి ఆయన నిర్ణయం తీసుకున్న తర్వాత  ఏ పరిస్థితుల్లోనూ వెనకడుగు వేసిన స్థితి ఎప్పుడు రాలేదు  అందుకే ఆయన చిరంజీవి.
భాస్కర్ అన్ని కార్యక్రమాలను చూసే ప్రయత్నంలో ఉంటే  నేనుబోసు వారి ప్రక్కన ఉండేవాళ్ళం  పిల్లల కోసం ఆయన ఎంత తపన పడేవారు అంటే  అరే అబ్బాయి పిల్లల్ని వారి తల్లిదండ్రులు చూసినట్లుగా చూసుకోవాలి. ఏ ఒక్క కుర్రవాడు బాధపడకూడదు అది మన బాధ్యత అని చెప్పేవారు. ఏ పదార్థం చేసినా ముందు ఆయన రుచి చూసిన తరువాతనే వడ్డన జరిగేది  అలాంటి ఉత్తమ వ్యక్తి కనుకనే  వారితో పాటు అన్ని సంవత్సరాలు కలిసి ఉండి అన్ని కార్యక్రమాలు చేయగలిగాం. ఈ క్షణానికి నేను భాస్కర్ బోసు కలిస్తే  కాకాని వారి ముచ్చట్లు లేకుండా మా మాటలు ఉండవు. మాలో అంత మరపురాని మనిషిగా నిలిచిపోయిన  సహృదయుడు  మాకు తెలిసి ఏ స్థాయిలో ఉన్న వ్యక్తి అయినా సరే ఒక్క పరుష వాక్యం వాడిన  సందర్భం లేదు.కామెంట్‌లు