ధర ఆధారం!;-డా. పి. వి .ఎల్ .సుబ్బారావు, 9441058797
 బాల పంచపది
============
.1. ప్రధాన పురుషార్థం ధర్మము!
    
    ధర్మ మార్గాన,
           సంపాదించు ధనము !
     
     ధర్మబద్ధ ,
               కామము దైవము !
     అటుపైన,
            సహజము మోక్షము !
    
   ధర ఆధారం ధర్మం,
            అన్యంకాదు,రామా!
2. సత్యం వద,
    రామాయణ ధర్మము!
   
    ధర్మం చర ,
     మహాభారత ధర్మము!  
    
  
    అహింస,
      మన పరమ ధర్మము!
  
   త్యాగము ,
      జనఅమృత ధర్మము!
 
  ధర ఆధారం ధర్మం ,
    అన్యం కాదు, రామా!
3. ధర్మానికి ఆపద సంభవము!
 
 దైవ ఆగమనము నిశ్చయము!
   
  లక్ష్యము ధర్మసంస్థాపనము!
 
  శిస్టరక్షణము ,దుష్ట శిక్షణము!
   
  ధర ఆధారం ధర్మం ,
     అన్యం కాదు, రామా!
4. ధర్మం వ్యక్తిగతము,
        సామాజికము !
    
    ఏదైనా,
        శ్రేయోధాయకము!
   
   ధర్మాచరణ,
        ప్రధమ  కర్తవ్యము!
  
  కర్తవ్యపాలనే,
            దైవారాధనము!
 
  ధర ఆధారం ధర్మం,
    అన్యం కాదు, రామా! 
5.మతం మనిషిని బట్టి మారు!
  
  అది మౌఢ్యానికి  మారుపేరు!
  
 జ్ఞానంతో అది నశించి తీరు!
  
 ధర్మజ్ఞానమే ధరకి సౌరు!
    
 ధర ఆధారం ధర్మం,
     అన్యం కాదు, రామా!
6. మానవ ఆదర్శం ,
           రాముని నడత!
  
   ఏకైకం,,
   శ్రావణ కుమార చరిత్త!
  
   ధన్యం మహాత్ముని,
             జీవన ఘనత !
 
   ధర్మ ప్రధానం ,
     ఏనాడు మానవత!
  ధర్మ ధర్మం ఆధారం ,
   అన్యం కాదు , రామా!
7. భూమికి,
     సహజము ఆకర్షణము!
  
    రక్షణ కవచనం,
                 ధర్మ రక్షణము!
     
   ధర్మరక్షణమే,
                   జనహితము!
   
   జనహితం,
              ఆదర్శ జీవనము!
 
   ధర ధర్మం ఆధారం,
   అన్యం కాదు, రామా!
8. విశ్వవిఖ్యాతం,
                భారత ధర్మము !
    
     భారత ధర్మము,
          మూలము వేదము!  
     
   ధర్మము తప్పిన,
             జీవనం వ్యర్థము!
    
   ధర్మమే,
          జీవన పరమార్ధము !
   
    ధర ధర్మం ఆధారం,
         అన్యం కాదు, రామా!
9. ధర ఇచ్చి,
          కొనలేనిది ధర్మము !
 
    ధర్మమే ఎంచగ,
            పరమ మర్మము!
  
    జీవనరథం, 
                ధర్మపథము!
   
   ధర్మమే నిలుచు ,
          ఆచంద్రార్కము !
   ధర ఆధారం ధర్మం,
       అన్యం కాదు, రామా!
_________


కామెంట్‌లు
Popular posts
సింగపూర్ లో యలమర్తి అనూరాధకు సన్మానం
చిత్రం
ఉదయం మా హృదయం...- ప్రమోద్ ఆవంచ 7013272452;
చిత్రం
దగ్గు , ఆయాసం,పిల్లి కూతలు - నివారణ ------------------------------------------------------- పిల్లల్లో జలుబు, దగ్గు, ఎక్కువైనప్పుడు ఊపిరి తిత్తుల్లోని శ్వాస మార్గాలు ముడుచుకు పోయినప్పుడు శ్వాస వదులుతున్నప్పుడు శబ్దం వస్తే దాన్ని పిల్లి కూతలు అంటారు. దీనికి ఉబ్బసం కూడా ఒక కారణం కావచ్చు. వైరస్ బాక్టీరియా , కారణంగా శ్లేష్మపు పొరలు వాచిపోతాయి. దాని వల్ల గురక వస్తుంది కఫం వాలా జ్వరం కూడా రావచ్చు. చిటికెడు పిప్పళ్ల చూర్ణంలో తేనే వెచ్చని నీటిలో కలిపి తాగిస్తే కఫ జ్వరం తగ్గిపోతుంది పిప్పళ్ల పొడిని పాలతో కలిపి తాగిస్తే ఉబ్బసం తగ్గి పోతుంది. పిప్పళ్ల పొడితో బెల్లం కలిపి తినిపిస్తే దగ్గు, ఉబ్బసం తో పాటు రక్తహీనత కూడా నివారించ వచ్చు. - పి . కమలాకర్ రావు
చిత్రం
సాహితీ ప్రియులకు అపురూప కానుక పొయిట్రి వర్క్ షాప్;-- యామిజాల జగదీశ్
చిత్రం
చిత్రం ;సాక్షి- 9వ తరగతి
చిత్రం