ధర్మ మార్గం;-ఏ బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9482811322
 మానవ ప్రకృతి ఎలా ఉంటుందంటే  తల్లిదండ్రులు  తనను ఈ భూమి మీదకు తీసుకొచ్చినప్పటి నుంచి  స్వార్థం తోనే జీవితాన్ని గడపడం అలవాటు చేసుకుంది ఈ ప్రాణి  తన శరీరంతో పాటు తనకు సంక్రమించిన ప్రతి ఆస్తి  అది డబ్బు కావచ్చు  పొలాలు కావచ్చు ఉద్యోగాలు కావచ్చు వ్యాపారాలు కావచ్చు అవన్నీ తన సొంతం  తాను కనుక అలా చేస్తున్నాను అని ఒక రకమైన ఆత్మ తృప్తితో జీవితాన్ని గడుపుతూ ఉంటాడు. బాల్యం నుంచి ప్రతి అవస్థలోనూ ఆ అవస్థకు సంబంధించిన  వేష భాషలను మారుస్తూ  కాలానికి తగినట్లుగా ప్రవర్తిస్తూ ఉంటాడు  తాను ఆరోగ్యంగా ఉండాలి ఈ శరీరాన్ని అనుక్షణం కాపాడుకుంటూ ఉండాలి  తన అందం ఎక్కడ తగ్గిపోతుందోనన్న స్వార్థంతో  సహజ సౌందర్యాన్ని వదిలివేసి  కృత్రిమ సోకుల కోసం ఆరాటపడడం తప్ప ఇంకొకటి మనకు కనిపించదు.
శరీరం మీద ఇంత వ్యామోహాన్ని పెంచుకున్న వాడికి  అసలు ఈ శరీర నిర్మాణం ఎలా ఉంది ఎక్కడ నుంచి వచ్చింది ఎవరు దీనిని ప్రసాదించారు  దీని మూల కారణం  వెతకడానికి ఎప్పుడైనా ప్రయత్నం చేశాడా  తల్లిదండ్రులు కారణమని  చెప్పుకుంటూ ఉంటాడు  నిజంగా తల్లి తండ్రి కారణమైనప్పుడు  వివాహమై బిడ్డలు లేని జంటలు  ఎన్ని వందల మంది ఉన్నారు  నిజంగా తండ్రే కారకుడు అయితే వారికి బిడ్డలు ఉండాలి కదా  ఎందుకు లేరు దీనికి కారణం ఏమిటి  అలాంటి ఆలోచనలను దగ్గరకు రానివ్వదు మన మనసు. అలాగే ప్రాణాన్ని గురించి  మానవుని ఆయుర్దాయం ఎంత ఉంటుందో దానిని మించి ఎక్కువ కాలం జీవించాలని తపన ప్రతి వ్యక్తికి ఉండి తీరుతుంది. దానికోసం ఎన్నో రకరకాల పాట్లు పడుతూ కృత్రిమ పద్ధతులను అవలంబిస్తూ జీవితాన్ని గడపడం  అలవాటైపోయింది.
తన దగ్గర ఉన్న ధనం  ఎలా వచ్చింది ఎవరి నుంచి వచ్చింది తన దగ్గర ఎలా నిలవ ఉన్నది అని ఒక్కసారి ఆలోచించుకుంటే  మూలానికి వెళితే తనకు తానే విషయాన్ని గ్రహించి  ఇలాంటి కారణాలవల్ల ఇలా జరిగిందా అని గమనించి  అప్పటికైనా దానిని సరిదిద్దుకోవడానికి ప్రయత్నం చేస్తాడా అంటే  దానికి మనసు అంగీకరించదు  ఈ విషయానికి  వేమన అద్భుతమైన పరిష్కారాన్ని మనకు అందించారు  జీవితంలో నీవు ఏదైనా సాధించు ఏదైనా సంపాదించు  అది ధర్మ మార్గంలో ఉండాలి తప్ప  ఎదుటివారిని సాధించి పీడించి  నీచ మార్కాలను అవలంబించి  పొందడం అనేది  మంచిది కాదు అన్న నీతిని చెబుతూ  అద్భుతమైన ఆటవెలదిని మనకు అందించారు ఆ పద్యాన్ని మీరు కూడా చదవండి  చదవడమే కాదు ధర్మాన్ని ఆచరించాలి కూడా.

"బొంది యెవరి సొమ్ము పోషింప పలుమారు ప్రాణమెవరి సొమ్ము భక్తిసేయ ధనము ఎవరి సొమ్ము ధర్మమే తన సొమ్ము..."


కామెంట్‌లు