లోకుల వెర్రి;-ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322.
 సమాజాన్ని పరిశీలించినట్లయితే  ఎదుట మనుషులను  చూసి వాక్స్రు ఏం చేస్తున్నారో, ఎలా చేస్తున్నారో గమనించి వారిలా చేయాలి అని మనసు పడతాడు ప్రతి వ్యక్తి. అంతే తప్ప తనకు  వ్యక్తిగత అభిప్రాయాలు  ఏది మంచో ఏది చెడో తెలుసుకొని దేనిని ఆచరించాలో  దానికోసం ఆరాటపడకుండా ఎదుటివారి ప్రవర్తన మీద ఆధారపడి ఉండడం వల్ల అతని మనసు చేయకూడని, చేయరాని  పనులన్నింటినీ చేయిస్తుంది. ఇతని వల్ల ఆ సుఖాలకు అలవాటు పడిన ఈ మానవుడు  తిరిగి సజ్జనుల సహవాసం చేస్తే తప్ప  మంచి మార్గంలోకి రాడు  కానీ అతనికి సజ్జనులు ఎవరో కూడా తెలియదు  వారిని అనుసరించాలన్న జ్ఞానమూ రాదు. చేసేది లేక ఆ దొంగ మాటలతోనే జీవితాన్ని గడుపుతూ ఉంటాడు.
కొంతమంది  పరలోక సౌఖ్యాలను ఆశించి  అడవులకు వెళ్లి తపస్సు చేసుకోవడానికి  ప్రయత్నం చేస్తూ  ఆకలిని చంపుకోలేక  కనిపించిన  ఆకులలములు తిని కుక్షి నింపుకోవడానికి ప్రయత్నం చేస్తారు.  ఇతని మనసు ఎప్పుడూ ఆకలి మీదే ఉంటుంది తప్ప  అసలు తాను ఏ కార్యక్రమం చేయడం కోసం ఇక్కడికి వచ్చాడో దానిమీద మనసుపెట్టి కేంద్రీకరించి  సాధన చేయడానికి  ఆకలి అడ్డు వస్తుంది. దానితో అతని తపస్సు ముందుకు సాగదు.  ఎవరినో తెలిసిన మునిని చూసి వారి వద్ద నేర్చుకోవడానికి ప్రయత్నిస్తే  కాయకల్ప చికిత్స గురించి  దానిని ఎలా చేయాలో  మిత్రులకు కూడా చెప్పి పంపిస్తాడు వారు చెప్పినప్పుడు విని అలాగే చేస్తానని మాట ఇచ్చి వస్తాడు  కానీ ఆకలిని తట్టుకోలేడు  అక్కడ మునికి ఇచ్చిన మాట తప్పవలసి వస్తుంది.
ఈ విషయంలో వేమన మహా శయుడు చెప్పిన  మంచి పోలిక  మేకలు సహజంగా ఆకులను మేస్తూ ఉంటాయి కదా. అలా వాటి కడుపు నింపుకొని హాయిగా కాలక్షేపం చేస్తాయి  ఆ ముని ఏది చెప్పాడో దానిని ఈ మేక అనుసరిస్తుంది కదా. మరి దానికి మోక్షం వస్తుందా  అసలు దానికీ ఆ దృష్టి ఉన్నదా అన్న విషయాన్ని స్పష్టం చేస్తూ  పిచ్చి మనుషులు ఏదో చేయాలని ఏదో చేస్తూ వెర్రిపోకడలు పోవడానికి సిద్ధపడతాడు.  ఎవరైనా తనకు తెలియని మార్గాన్ని  ఎంచి ప్రయాణం కొనసాగించినప్పుడు  తన జీవితంలో  చేరవలసిన స్థలానికి చేరలేరు. కనుక తాను ఎక్కడకు వెళ్లాలో  దానికి మార్గం ఎటునుంచి సులభంగా ఉంటుందో  ఆ విషయం తెలిసిన వారి దగ్గర నుంచి  వివరాలు తీసుకొని ఆ పని చేస్తే అది సక్రమంగా అవుతుంది తప్ప. ఊరికే వెళ్లాను చేశాను అని అనుకుంటే ఫలితం వస్తుందా  అని అక్షేపిస్తూ అంటాడు వేమన. ఆ పద్యం మీరు చదవండి.

"ఆకులెల్ల దిన్న మేకపోతుల కెల 
కాకపోయె నయ్య కాయసిద్ధి  
లోకులెల్ల వెర్రిపోకళ్ళ బోదురు..."కామెంట్‌లు