మానవుని ఆశ ఎంత ఘోరంగా ఉంటుందంటే ప్రతి ఒక్కరూ తనకు మించిన తనకు దక్కని వాటిపైన మక్కువ ఎక్కువగా ఉంటుంది. నిజానికి అది అడవిని దహించి వేసే దావానాళం ఎలా ఉంటుందో మనిషి మనసును నాశనం చేసే కోర్కెలు అంత ఘోరంగా ఉంటాయి ఆ దావానలాన్ని ఆర్పడం ఎలా అనేది మనిషి ఆలోచించాలి ఈ ప్రపంచంలో ఏ సమస్య వచ్చినా దానికి పరిష్కారం అంటూ ఏదో ఒకటి ఉంటుంది దానిని కనుగొన్నప్పుడు త్వరగా పరిష్కరించడానికి అవకాశం ఉంటుంది దానినే ఆలోచిస్తూ కూర్చుని ఎలాగా ఎలాగా అంటూ చింతిస్తూ ఉంటే ఆ బాధ మరీ పెరిగిపోతుంది మంటను ఆర్పాలి అంటే నీళ్లను చల్లాలి అలాగే నీ మనసులో నీ స్తోమతకు మించిన వాటిని కోరినట్లయితే ఆ కోరికను చంపుకుంటే తప్ప ఆ దావానలం ఆగదు. ప్రతి వ్యక్తిలోనూ తన మనసు బలహీన పడినప్పుడు అరిషడ్వర్గాలన్నీ అతనిలో చేరడానికి పనిగట్టుకుని ఎదురు చూస్తూ ఉంటాయి ఏ క్షణాన బలహీనుడయ్యాడో వెంటనే అవన్నీ లోపల ప్రవేశిస్తాయి కామ, క్రోధ,లోభ, మోహ మద మాశ్చర్యాలు ఒకదానితో ఒకటి పెన వేసుకుని ఉన్నవే కామం ఉన్నచోట మోహం వస్తుంది. అది ఉన్నవాడికే మదం పెరుగుతుంది అలా అన్నిటికీ లోనైన వ్యక్తి ఎందుకు పనికిరాకుండా పోతాడు. కనుక యోగుల దగ్గర విషయాలను సమగ్రంగా తెలుసుకొని ఆ కోపాన్ని తగ్గించుకోవడానికి పద్ధతులను తెలుసుకొని నడుం బిగించి వారు చెప్పిన పద్ధతిలో తూ.చా తప్పకుండా చేసినట్లయితే తప్పకుండా అరిషడ్ వర్గాలకు దూరంగా ఉండి కోపము అనేది నీ జన్మలో రాకుండా పోతుంది.
భారతీయ తత్వశాస్త్రంలో యోగానికి ప్రథమ స్థానం ఇచ్చారు యోగులు. యోగం ఎప్పుడు అవసరమవుతుంది జీవితంలో ఎన్నో రకాల ఆశలతో కోర్కెలతో బ్రతుకుతూ అవి సిద్ధించకపోతే జీవితం మీద అభిరుచి తగ్గి ఏమి చేయడానికి తోచక పెద్దల సలహాలతో యోగం చేసే పద్ధతిని తెలుసుకొని మనసును బిగబట్టి తాను దేనిని సాధించదలచుకున్నాడో దానిపైన మనసును లగ్నం చేసి అనుక్షణం దానిని కాపాడుకుంటూ ఉంటే తనలో ప్రవేశించిన దురాశ అన్నది మటు మాయమైపోతుంది అంటాడు వేమన అది వ్యక్తిగతంగా ఆయన అనుభవాల్లో రుచి చూసిన చేదు ఫలితాలను దృష్టిలో పెట్టుకుని చేసిన ఆటగలది ఒకసారి మీరు కూడా అది చదివితే మీరు కూడా యోగిగా మారడానికి అవకాశం ఉంది.
"అన్ని గోసి వేసి అనలంబు చల్లార్చి
గోచి బిగియ కట్టి కోపమడచి ఆశ వీడెనేని అతడే తా యోగి రా"

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి