ఓటు నోటు;-.బెజ్జంకి.జగన్నాథాచార్యులు-- మాచర్ల.--సెల్ ;--98485 62726.

ఓటుకు నోటిస్తారు
నోటుకు ఓటేస్తారు.
నోటు లేనిదే ఓటు పడదు
ఓటు పడందే కోట్లు రావు

కోట్లు కొల్లగొట్టాలంటే ఓట్లు కొనాలి
ఓట్లు కొనాలంటే నోట్లు కావాలి
ఓట్లకు నోట్లకు తియ్యని బంధం
పడుగు పేకలా అల్లుకున్నబంధం

ఓటు అమ్మినోడు ఓడిపోతాడు
ఐదేండ్లు బానిస ఔతాడు
ఓటు కొన్నోడు కోట్లు కొల్లగొడతాడు
ఐదేండ్లు అధికారం చెలాయిస్తాడు 
నిన్ను బానిసను చేస్తాడు

ఓటు నీ చేతి ఆయుధమురా!
అవినీతిని తరమరా?
నోటుకు ఆశపడకురా ఓటరా!
దేశ ప్రగతికి తోడ్పరా!
నిఖాసైన నాయకులను ఎన్నుకోరా
ఓటు విలువను కాపాడరా
ఓటుకు నోటను మాటను తుడిపేయరా!
 
ఓటు నోటు పడుగు పేక
కారాదవి నేసిక కోక
నోటుకు ఓటును అమ్మకురా
ఓటరు మహాశయా !వందనాలు 
నీకు వేయి వేయి వందనాలు.
          *****

          ..
కామెంట్‌లు