పుస్తకం నా బతుకు చిరునామా;-డా.టి.రాధాకృష్ణమాచార్యులు-9849305871.
బతుకు ఊపిరి అక్షరమై 
నా గుండెలో మొలకైంది
పలక బలపం చేతిలో ఆడుకోవడం
అప్పుడు కొత్త ఆట అది

మెదడులోకి ఎక్కి 
సజీవంగా
అంతరంగంలో ప్రవహించడం 
ఓ జీవ కళగా వెలిగే బతుకు కళ

నెమలీక అక్షరాలను
దాచింది పుస్తకాల్లో వరుసలుగా
ఆ లైన్ల మధ్యగల సాహిత్య రసాత్మకతను జుర్రుకొమ్మంది
పుస్తకం చదివి కొత్తగా జ్ఞానం పొంది
జీవించమంది మంచి విజ్ఞానంతో

పుస్తకం మనిషికి చిరకాల నేస్తం
నాకైతే పుస్తకం బతుకు చిరునామా
సర్వజ్ఞాన సంగమ సంతృప్తి నిచ్చు
బీజాక్షరాల పేజీల పొత్తం 


కామెంట్‌లు
K.Ravindra Chary చెప్పారు…
Excellent. Telangana accent and life as well are wonderfully reflected in this song...It is a beautiful representation of all the book lovers and also lovers of literature.The poet had already been an acknowledged celebrity in yhe field.my admiration knows no bounds for his simple and impressive style of writing
Kittu చెప్పారు…
Creative Poetry. Insightful and Illustrative and Inspirational. Thanks for writing such great poetry.
Popular posts
సింగపూర్ లో యలమర్తి అనూరాధకు సన్మానం
చిత్రం
ఉదయం మా హృదయం...- ప్రమోద్ ఆవంచ 7013272452;
చిత్రం
తెలంగాణ సారస్వత పరిషద్ ఆద్వర్యం లో తొలి బాల సాహిత్య సమ్మేళనం
చిత్రం
దగ్గు , ఆయాసం,పిల్లి కూతలు - నివారణ ------------------------------------------------------- పిల్లల్లో జలుబు, దగ్గు, ఎక్కువైనప్పుడు ఊపిరి తిత్తుల్లోని శ్వాస మార్గాలు ముడుచుకు పోయినప్పుడు శ్వాస వదులుతున్నప్పుడు శబ్దం వస్తే దాన్ని పిల్లి కూతలు అంటారు. దీనికి ఉబ్బసం కూడా ఒక కారణం కావచ్చు. వైరస్ బాక్టీరియా , కారణంగా శ్లేష్మపు పొరలు వాచిపోతాయి. దాని వల్ల గురక వస్తుంది కఫం వాలా జ్వరం కూడా రావచ్చు. చిటికెడు పిప్పళ్ల చూర్ణంలో తేనే వెచ్చని నీటిలో కలిపి తాగిస్తే కఫ జ్వరం తగ్గిపోతుంది పిప్పళ్ల పొడిని పాలతో కలిపి తాగిస్తే ఉబ్బసం తగ్గి పోతుంది. పిప్పళ్ల పొడితో బెల్లం కలిపి తినిపిస్తే దగ్గు, ఉబ్బసం తో పాటు రక్తహీనత కూడా నివారించ వచ్చు. - పి . కమలాకర్ రావు
చిత్రం
కళ్యాణ దంపతులు; - శంకరప్రియ., శీల., సంచారవాణి:99127 67098
చిత్రం