🙏అన్నపూర్ణ! భవాని!
సదా పూర్ణరూపిణి!
విశ్వేశ్వరుని రాణి!
శ్రీమాతా! శివాని!
🙏అన్న వస్త్రములను
జ్ఞాన భిక్షను మాకు
అనుగ్రహింపుము జనని!
శ్రీమాతా! శివాని!
(..శ్రీమాత నామాలు., శంకరప్రియ.,)
👌మనమంతా ఆహారము భుజించు సమయము నందు; జగద్గురు ఆది శంకరాచార్యులు వ్రాసిన, "అన్న పూర్ణాష్టకము"ను భక్తిశ్రద్దలతో చదవoడి! కనీసము, ఒక్కశ్లోకమైనా పారాయణము చేయండి!
🙏 అన్నపూర్ణే! సదాపూర్ణే!
శంకర ప్రాణవల్లభే!
జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం!
భిక్షాం దేహిచ! పార్వతీ!
...అని, అన్నపూర్ణాంబికను స్మరించాలి! అటుపిమ్మట, వడ్డించిన ఆహారమును స్వీకరించాలి!
👌అన్నపూర్ణాదేవి.. సకల ప్రాణికోటికి, అన్న వస్త్రములను అనుగ్రహించు చున్నది! ఎల్లపుడు పూర్ణ స్వరూపముతో ప్రకాశించు చున్నది! దేవతలందరిచే
ప్రశంసింపఁ బడుచున్నది!ఆమె.. సర్వ శుభంకరుఁడయిన శంకర భగవానునకు ప్రాణేశ్వరి! ఆ జగన్మాతను మనమంతా..
"అంబా! మాకు జ్ఞానము, వైరాగ్యము.. మున్నగునవి, సిద్ధించుట కొరకు, భిక్షను ప్రసాదించుము!" అని, భక్తి ప్రపత్తులతో, త్రికరణముల శుద్ధిగా ప్రార్ధించాలి!
🚩తేట గీతి పద్యము:
అన్నపూర్ణ! సదాపూర్ణ! యమర వినుత!
శంకర ప్రాణవల్లభ! సరసిజాక్షి!
జ్ఞాన వైరాగ్యములు మాకు గలుగఁ జేయ
పార్వతీ! భిక్ష నొసగుమ! ప్రణుతులమ్మ!
(తెలుగు సేత: శ్రీ చింతా రామకృష్ణా రావు.,)

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి