సింబోతు.. మేకపోతు- శంకరప్రియ., శీల.,--సంచారవాణి: 99127 67098
 👌సింబోతు మాటలకు
హడలెత్తి పోయింది!
     అడవిలో సింహమ్ము!
ఆత్మ బంధువులార!
      (ఆత్మ బంధు పదాలు., శంకరప్రియ.,)
👌"సింబోతు" అనగా మేకల సంరక్షకుడు! మేక పోతు! అది.. అడవిలో గాంభీర్యముగా సంచరించు చున్నది! మేకల మందను కాపలా కాయు చున్నది! "ఐక్య మత్యమే మహా బలము" అని, నిరూపించింది.. సింబోతు!
👌ఒకరోజు, సింబోతుకు.. మృగరాజైన సింహము ఎదురైనది!
"నీవు ఎవరవు?" అని, అడుగగా; "నేను మేకల మందకు నాయకుడను!" అని బదులు పలికింది! "నీ పేరేమిటి?" అని, ప్రశ్నిoచగా; "సింబోతు!" అని, జవాబిచ్చింది! "ఇక్కడికి ఎందు కొచ్చావు?" అని, హెచ్చరించింది!
👌"నేను.. ఇరవై (20) ఏనుగులను; నూరు (100) పెద్ద పులులను;  ఒక్క (1) సింహమును.. ఆహారంగా భుజించుటకు వచ్చితిని! ఈ అడవిలో.. పెద్ద జంతువులను వేటాడడమే.. నా వ్రతదీక్ష! అందుకోసమే నేనిక్కడకు వచ్చాను! ఇంతలో నీవు ఎదురు పడ్డావు!" అని, మేకపోతు తన గడ్డం దువ్వుకొనుచు!; గాంభీర్యముగా పలికింది! ఆ సింబోతు మాటలకు, సింహము భయపడి పోయింది! తన తోకను ముడుచుకుని పారిపోయింది!
(దీనినే.. నేటి కులసంఘములకు, కట్టుబాటులకు.. సంకేతముగా పేర్కొనవచ్చును.,)
🚩సప్తపాద తేటగీతి
   "ఎవ్వడవు నీవు?" "మేకల నేలువాడ!"
    "నామ మెయ్యది?" "సింబోతు"!   "నా గృహమున
     నేల యుండుట?" "యిరువది(20) యేనుగులను"
     పులులు నూరిటి (100), నొక (1) సింగమును భుజించి,
      గడ్డమంతయు గొరిగింప గట్టి వ్రతము
     పూని, వచ్చితి కావుమో! పుణ్యమూర్తి!"
     అనగ, వాలంబు ముడిచి సింహంబు సనియె.
    ( "కర్ణానంద దాయిని"., బి. బాలాజీ దాస్,1911.,)

కామెంట్‌లు