👌సచ్చిదానంద మయ
పరంబ్రహ్మ తత్త్వము
మననమ్ము చేయండి!
ఆత్మ బంధువు లార!
👌స్వాత్మారాము డైన
పరమేశ్వర తత్త్వము
విచారణ చేయండి!
ఆత్మ బంధువులార!
( ఆత్మ బంధు పదాలు. , శంకరప్రియ.,)
👌సత్.. చిత్.. ఆనంద స్వరూప మైనదీ.. పరంబ్రహ్మ తత్వము! అది.. "పీపీలికము" (చీమ) నుండి "బ్రహ్మము" వరకు వ్యాపించి యున్నది! దివ్య లీలా విభూతులలో
నెలకొని యున్నది!
సర్వ శక్తివంత మైనదీ.. పరమేశ్వర స్వరూపము! ఇది.. ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తులతో విరాజిల్లు చున్నది!సకల ప్రాణికోటిలో.. అంతర్యామిగా విలసిల్లు చున్నది!
👌"తత్త్వం" అంటే స్వరూపము! దీనికి నానార్ధములు కలవు!
"తత్.. త్వం" అనగా "అదియే నీవు" అని, విశేషార్థం! "అక్షర"మనగా వినాశనము కానిది.. "అద్వితీయ" మనగా రెండవది లేనిది.. పరమేశ్వర స్వరూపము! దీనిని.. యుక్తాయుక్త వివేక జ్ఞానంతో, సత్పురుషుల సాంగత్యముతో, స్వానుభవపూర్వకముగా విచారణ కొనసాగించాలి! "శ్రీశివతత్త్వ రహస్యము" వలన.. ఆరాధకులకు, సాధకులకు.. నిత్యమైన, సత్యమైన ఆత్మజ్ఞానము కలుగుతుంది! వారికి శాంతి, సౌఖ్యములు లభిస్తాయి! స్వాత్మ తత్త్వ చింతనముతో.. "జీవుడే శివుడు" అగుచున్నాడు! శివమస్తు!
🚩ఆట వెలది
తత్త్వ బోధ వ్రాసి తాత్త్వికుండ నయితి!
సత్తు చిత్తు లందె శాంతి గంటి!
విత్తు నాటి జూడ విదితమాయె బ్రతుకు!
సర్వ సాక్షి నాత్మ శర్వు గంటి!
(.."తత్త్వ బోధ", కవిశ్రీ సత్తిబాబు., )

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి