మన సంస్కృతీ సంప్రదాయములు- శంకర ప్రియ., శీల.,--సంచారవాణి: 99127 67098
 👌భారతీయ సంస్కృతి
     సంప్రదాయమ్ములే
      మన జాతికి సంపద! 
            ఓ తెలుగు బాల!
      (తెలుగు బాల పదాలు., శంకర ప్రియ.,)
👌మన భారతీయ సంస్కృతీ సంప్రదాయములను, మనకందించిన మహర్షులే.. మనకు మార్గదర్శులు! వారి అడుగు జాడలలో మనమంతా ప్రయాణించాలి!
     "శైవము, వైష్ణవము, శాక్తేయము, గాణాపత్యము, కౌమారము, సౌరము.." మున్నగునవి; మన భారతీయ సంస్కృతీ సంప్రదాయములు!
👌కర్మ.. భక్తి.. జ్ఞానము.. యోగము.. మున్నగునవి; ఆచరణ యోగ్యమైన మార్గములు! వీటిని మనమంతా భక్తి శ్రద్ధలతో, యథాశక్తిగా పాటించాలి! మన భావితరమునకు వివరించాలి!
     "క్రొత్త వింత, ప్రాత రోత!" సామెత లాగ; నేటి ఆధునికులు, విజ్ఞాన వేత్తలు.. "మన సంస్కృతీ సంప్రదాయము"లను; హ్రస్వ దృష్టితో అవహేళన కావించు చున్నారు! వారందరూ..  అదేపనిగా ప్రచారం చేస్తూ; భ్రమలో సంచరించు చున్నారు! తస్మాత్ జాగ్రత్త! సాధకు లార! "సత్య శోధన" చేయండి!
         🚩ఆటవెలది🚩
    క్రొత్త వెర్రి తలలు క్రొత్త సంపద గని
    పాత నుడుల కెల్ల పాడె గట్టు;   
     సంప్రదాయ మట్టి సంపదల్ మరి లేవు 
     తెలుగు బిడ్డలార! తెలివి గనుడి!
( "తెలుగుబిడ్డ శతకము" కవిశ్రీ సత్తిబాబు., )

కామెంట్‌లు