కనులందు సుంతైన కరుణ కనపడకుండ
మొత్తమెదలో దాచి ముక్కంటి వయ్యావు
కష్టాలు,కన్నీళ్ళు కడుపులోనే దాచి
వేడ్కచూపెడుతావు,విసమేతరౌతావు
ఇంటిల్లిపాదికిని ఇచ్చి,యడిగినవన్ని
లీల కనపడుతావు బోళశంకరుడవై
బరువులన్నియు తలను భాగీరథీ కాగ
సమ్మతిని మోస్తావు జడదాల్పువేల్పువై
బంగారు బాటలో భవ్య భవితను దిద్ది
నీతి జీవితమిచ్చి నిలబెట్టితివి నన్ను
నాలోని నడతలో నాలోని చింతలో
నీ తనమె,నీ ధనమె, నీ గీతె ఓ నాన్న!!
========================
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి