శబ్ద సంస్కృతి!అచ్యుతుని రాజ్యశ్రీ
 సుశ్రూష అంటే సంస్కృతంలో వినాలనే కోరిక. కానీ ఇప్పుడు సేవ అనే అర్ధం లో వాడుతున్నారు. వినాలనే కోరిక కాస్తా ఆజ్ఞకి పర్యాయపదంగా మారింది. రోగికి సేవశుశ్రూష చేయడం అనే అర్ధం లో వాడుతున్నారు. 
శూర్పారక్ అంటే పరశురాముడు గొడ్డలి ని విసిరి పొందిన భూప్రాంతం అని అర్ధం. ఆప్రాంతం నేటి కేరళ 
శేఖ్ షేఖ్ అంటే విద్వాంసుడు అని అర్ధం. అరబ్ ప్రాంతాల నించి వచ్చిన పుణ్యాత్ములని అలా పిలిచేవారు.క్రమంగా ముస్లింలకు వాడుతుంటారు. ముస్లిం  మత ఉపదేశాలు చేసేవారికి వాడతారు .మహ్మద్ ప్రవక్త  వంశీయులను కూడా షేక్ అంటున్నారు. ఇదొక బిరుదు.
శోషణ అంటే ఓవ్యక్తినుంచి అనుచితలాభం పొందటం! ఆంగ్లంలో ఎక్స్ ప్లాయిటేషన్ అంటారు. సంస్కృతంలో ఎండబెట్టు పీల్చి పిప్పిచేయు అనే అర్థం. దుర్బలవ్యక్తిని తన గుప్పిట్లో బిగించి శోషింపచేయటం!
శౌరసేనకి రాజు శూరసేనుడు.మహాభారతం ప్రకారం  జనపదం అని నివాసి అని  రెండు అర్ధాలు వస్తాయి.

కామెంట్‌లు