చిట్టిపొట్టి పాపల్లారా!;-గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
చిట్టిపొట్టి పాపల్లారా తెలుగుతల్లి పిల్లల్లారా
తెలుగుబాష చాలగొప్పరా శ్రద్ధపెట్టి నేర్చుకోండిరా

తెలుగక్షరాలు సొగసురా గుండ్రని ముత్యములురా
అ ఆలు మధురమురా అమ్మ ఆవులు శ్రావ్యమురా

వాణీవీణా నాదములా పలుప్రక్రియల ప్రవాహములా
సాహిత్యలోక సారములా తెలుగు ఘనాతిఘనమురా

మల్లెల పరిమళంలా మొగలిపూల వాసనలా
మరువము సువాసనలా తెలుగుభాష సౌరభమురా

సూర్యుని కిరణములా చంద్రుని వెన్నెలలా
మెరుపుతీగ కాంతిలా తెలుగుబాష వెలుగురా

చెరకుగడల రసములా తేనెపట్టు చుక్కలా
పంచదార పాకములా తెలుగుబాష తీపిరా


కామెంట్‌లు