మిడిసిపాటు!అచ్యుతుని రాజ్యశ్రీ

 మనందరికన్నా ముందు లేచి మనల్ని లేపేది కొక్కొరొకో అనే కోడి.మరి దీని వెనుక ఓకథ ఉంది. ఓకోడిపెట్ట పెట్టిన గుండ్రనించి పిల్లలు త్వరగా బైటికి వచ్చాయి.ఓకోడిపిల్ల కాస్త ఆలస్యంగా బంగారు వెండి రంగులో మెరుస్తూ బైటికి వచ్చింది.దాన్ని అంతా తెగ గారాబం చేస్తుంటే దానికి పొగరు గర్వం పెరిగింది. అది చెప్పాపెట్టకుండా రాజమహల్ కి వెళ్లింది.అక్కడ చిన్న కట్టెలపొయ్యి లోని నిప్పు అడిగింది " నాలో రెండు కట్టెపుల్లలు వేయి."" నీకోసం చితుకులు ఏరి నేనెందుకు తేవాలి?" అని ముందుకు సాగింది. ఓచిన్న నీటి కాలువ అడిగింది "గులకరాళ్లు అడ్డంపడ్డాయి.కాస్త తీయవా?"" నాకు ఇదేపనా? నీవు  వేగంగా ప్రవహించు" అని ముందుకు సాగింది. ముళ్లకంపల లో చిక్కుకున్న గాలి అడిగింది " కోడిపిల్లా! కాస్త కంపలని తొలగించు.ఊపిరాడటం లేదు: ఠాఠ్ అని  వెళ్లి రాజు గారి వంటింట్లో దూరింది.వంటవాడు దాన్ని పట్టి కుండలో వేసి నీరుపోసి మంటమీద పెట్టాడు. అది కుయ్యోమొర్రో అని ఏడుస్తూంటే జాలితో మంట ఆరిపోయింది.నీటిలో తపతప కొట్టుకుని ఏడుస్తున్న కోడి పై జాలిపడి గాలి విసురుగా వీచటంతో కుండ దొర్లి నేలపై పడి భళ్ళున  బద్దలైంది.అంతే కోడి పరుగులు పెడుతూ అనుకుంది" నేను అహంకారం తో సాయంచేయకపోయినా అవి నాప్రాణాలు కాపాడాయి.ఇకనుంచి అందరినీ మేలు కొల్పుతాను" అని అమ్మ దగ్గరకు సురక్షితం గా చేరింది🌹
కామెంట్‌లు