* చిత్రకవిత * -- కోరాడ నరసింహా రావు !
 సహజ ప్రకృతి సౌందర్యాన్ని 
 యే కవి వర్ణించగలడు... !?
యేచిత్రకారుడుచిత్రించ గలడు 
అందుకే... సహజ సౌందర్యరాశి 
యైనస్త్రీని ప్రకృతితోపోల్చేది..!
స్త్రీని,ప్రకృతిని... భోగవస్తువు లుగా కాక ఆరాధ్య దేవతా ప్రతి 
రూపాలుగా గుర్తించి, గౌరవించి 
ఆరాధించేవారే నిజ పురుషులు
    వారే...కవియై ప్రకృతి - స్త్రీల
సౌందర్యాలను సహజసుందరం గా కవిత్వీకరించగలరు... !
 
చిత్రకారులు,శిల్పులైప్రాణ...
 ప్రతిష్ట చేయగలరు... !!
 
      గాయకులై.. భావయుక్త గానరాగాలాపనలతో రసిక హృదయాలను రంజింప జేయ గలరు... !
కవిత్వమంటే.... 
రసావిష్కరణ... ఆస్వాదన... !
  అనుభూతించి.... 
అనుభూతింప జేసేదేకవిత్వం!!
         ******
.... కోరాడ నర్సింహా రావు !

కామెంట్‌లు