* ఆనందం చూడండి *(చిత్ర కవిత)- కోరాడ నరసింహా రావు !

 సాఫీగా సాగిపోయే జీవితానికి 
అంగవైకల్యం పెద్ద అడ్డంకే... !
 కృత్రిమ అవయవం నడిపించే చేతి ఊత కాస్తంత సహకరించి నా... సంపాదన లేక, బతుకు సాగదు కదా.... !
   పదుగురూ... వచ్చీ పోయే దారిలొ మనసును చంపుకుని దీనంగా చేయి చాచి యాచించే దుస్థితి... !
  దుబారా ఖర్చు లెన్నోచేస్తాము
దీనులను చూసి కూడ చూడ నట్టు పోతాము !
     , ఒక్కొక్కరు వేసే కాసింత చిల్లర ఆ పొట్టకింత కూడు నిచ్చి సంతృప్తిని కలిగించును 
      చేయిచాచు దీనులకు... 
తోచినంత ఇవ్వండి..., 
     వారి ముఖాలలో ఆనందం 
... .   చూడండి... !
    ********
కామెంట్‌లు