సునంద భాషితం ;-వురిమళ్ల సునంద, ఖమ్మం
 తిరము... తీరము
   ******
ఏ పని చేయాలన్నా ముందుగా మానసికమైన ఒత్తిడి లేకుండా చూసుకోవాలి.మనసు ఎంత ప్రశాంతంగా తిరముగా ఉంటే అంత మంచి ఫలితం పొందవచ్చు.
మనసు,మాట ఇవి రెండూ తిరము లేని వారిపై ఎవరికీ నమ్మకం ఉండదు.
ఆలోచనల తిరమే ఆత్మ నిగ్రహానికి, ధ్యానపరమైన  స్థితప్రజ్ఞతకు దారి తీస్తుంది.
తిరము అంటే ఏమిటో చూద్దాం..స్థిరము, అకుంఠము, అచలము, శాశ్వతము,స్థైర్యము,నిచ్చలము, ధారణ, అచ్యుతము లాంటి అర్థాలు ఉన్నాయి.
కొంతమందికి ఎందులోనూ తిరము ఉండదు.తరచుగా అపజయాల పాలు అవుతుంటారు.  అలాంటి వారి జీవితము నడి  సంద్రంలో నావలా కనిపిస్తుంది.ఏ  దారి తెన్నూ  కానరాక అనుకున్న  లక్ష్య తీరమును చేరుకోలేరు.
జీవితం ఆనందాల హరివిల్లై విరబూస్తూ, ఆదర్శాల పరిమళాలు పంచుతూ, ఆత్మ తృప్తి తీరము చేరాలంటే మనసు  తిరముగా ,ఎలాంటి ఒడుదుడుకులనైనా అవలీలగా ఎదుర్కొనేలా ఉండాలి.
తీరము అంటే ఏమిటో చూద్దాం...ఒడ్డు,తటి,తటము,కూలము,దరి,పారము,గట్టు,ఉద్దరి,గడ్డ లాంటి అర్థాలతో పాటు నాగము,సత్తు, ప్రాంతము,ఆలీనము,తమరము, రంగము లాంటి అర్థాలు కూడా ఉన్నాయి.
మనసుకు ఉన్న శక్తి అమేయమైనది. ఆ మనస్సును తిరముగా చేసి కొని  అనుకున్నవి సాధిస్తూ అద్భుతాలను సృష్టించ వచ్చు, అందరిలో రాణించ వచ్చు.
సాయంకాల నమస్సులతో 🙏
 

కామెంట్‌లు
Popular posts
చిత్రాలు ; ..జ్యోతి టీచర్ వివేకానంద కాన్వెంట్ హైస్కూల్ భారత్ నగర్ (మూసాపేట)- హైదరాబాద్
చిత్రం
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
దగ్గు , ఆయాసం,పిల్లి కూతలు - నివారణ ------------------------------------------------------- పిల్లల్లో జలుబు, దగ్గు, ఎక్కువైనప్పుడు ఊపిరి తిత్తుల్లోని శ్వాస మార్గాలు ముడుచుకు పోయినప్పుడు శ్వాస వదులుతున్నప్పుడు శబ్దం వస్తే దాన్ని పిల్లి కూతలు అంటారు. దీనికి ఉబ్బసం కూడా ఒక కారణం కావచ్చు. వైరస్ బాక్టీరియా , కారణంగా శ్లేష్మపు పొరలు వాచిపోతాయి. దాని వల్ల గురక వస్తుంది కఫం వాలా జ్వరం కూడా రావచ్చు. చిటికెడు పిప్పళ్ల చూర్ణంలో తేనే వెచ్చని నీటిలో కలిపి తాగిస్తే కఫ జ్వరం తగ్గిపోతుంది పిప్పళ్ల పొడిని పాలతో కలిపి తాగిస్తే ఉబ్బసం తగ్గి పోతుంది. పిప్పళ్ల పొడితో బెల్లం కలిపి తినిపిస్తే దగ్గు, ఉబ్బసం తో పాటు రక్తహీనత కూడా నివారించ వచ్చు. - పి . కమలాకర్ రావు
చిత్రం
చిత్రాలు ; జి.జీవనజ్యోతి టీచర్ వివేకానంద కాన్వెంట్ హైస్కూల్ భరత్ నగర్ హైదరాబాద్
చిత్రం
తెలివితేటలు!! ప్రతాప్ కౌటిళ్యా
చిత్రం