మినీలు ; జయా
ఎత్తు నుంచీ
చూస్తున్నప్పుడు
ఇతరులు 
చిన్నవాళ్ళుగా 
కన్పించొచ్చు
కానీ
వారిలో
నువ్వూ ఒకరనేది
మరచిపోకూడదు
++++++++++++
నన్నెవరూ
చూడటం లేదనే 
ఆలోచనే
నాతో 
తప్పులు చేయిస్తూ
వచ్చింది

కానీ
ఎవరో ఒకరు
నన్ను చూస్తూనే 
ఉన్నారనేది మాత్రం
నిజమున్నర నిజమని
తెలిసాకే
తప్పులు తగ్గడం
మొదలయ్యాయి

కామెంట్‌లు