డ్రింక్స్! పానీయాలు! సేకరణ ;-అచ్యుతుని రాజ్యశ్రీ

 నేడు సాఫ్ట్ డ్రింక్స్ తాగటం సాధారణమైపోయింది.ఇంట్లో తయారుచేసే షర్బత్ కన్నా బైట కన్పడేవి పిల్లలు పెద్దలకు ఇష్టం గా మారింది. ప్రాచీన రోమన్లు బుడగలువచ్చే  మినరల్ వాటర్ తాగేవారు.సహజంగా వచ్చే ఊటనీరు ఆరోగ్యానికి మంచిది. బుడగలు రావటానికి కారణం అందులో కార్బన్ డయాక్సైడ్ ఉండటమే!క్రీ.శ.1700లో మామూలు నీటిలోకి ఈవాయువుని పంపి సోడాని అందుబాటులోకి తెచ్చారు. ఆనీటికి వాసన రుచి కోసం 1784 లో సిట్రిక్ యాసిడ్ ని తయారు చేశారు. 1833లో ఇంగ్లాండ్ లో కార్బొనేటెడ్ లెమనేడ్  వాడుకలోకి వచ్చింది. 1886లోకోకోకోలా  చరిత్రను సృష్టించింది.
ఇక ఈజిప్షియన్లు డ్రింక్స్ తోపాటు 40రకాల పేస్ట్రీలు బ్రెడ్  రకరకాల ఆకారాల్లో చేసి తినేవారు. అవి కేవలం ఆనాటి పూజారులు కులీన వర్గంవారికిమాత్రమే సుమా!
ఇకప్రాచీన నాగరికతల్లో వైన్ ప్రసిద్దికెక్కింది.క్రీ. పూ.6వేలలోనే అన్నినాగరికతల్లో వైన్ వాడకం ఉంది. మెసపొటేమియా లో ద్రాక్షవిస్తారంగా పండటంతో దీనితో తయారు చేసిన వైన్ ని డాక్టర్లు రోగులకు ఇచ్చేవారు.కొన్ని మూలికలు కలిపేవారు.క్రీ.పూ.1000లో రోమన్లు ద్రాక్షరసంలో రంగులు రుచులున్న వెరైటీలు  చేసి మద్యాన్ని తయారు చేశారు. రోమన్ సామ్రాజ్య పతనంతర్వాత యూరప్ లో ఈపరిశ్రమ బాగా పుంజుకుంది. ఆనాటి మతాధికారులు చర్చీ పూజారులు ద్రాక్షతోటలు పెంచి అందరికీ పంచేవారు.ప్రాచీన పర్షియన్ గాథ ప్రకారం ఓరాకుమారి భర్త ప్రేమాభిమానాలు పొందలేక ఒక పాత్రలో ఉన్న పాడైన ద్రాక్షపండ్లు తిన్నది. చనిపోవాలనే ఉద్దేశం తో! విషంగా మారుతుంది అనుకుంది కానీ మత్తుగా  చాలా సేపు నిద్రపోయింది.మెలుకువ వచ్చాక హాయిగా  రిలాక్స్ అవటంచేత బాధ సమసిపోయింది.అలా వైన్ కి బీజం పడిందిట! మరి ఇప్పుడూ అంతేకదా? మత్తు లో గమ్మత్తుగా ఉంది అని యువత చిత్తు చిత్తుగా తాగుతున్నారు. 🌺
కామెంట్‌లు