దాదాపు 2500 ఏళ్ల క్రితం.. వైదిక సంప్రదాయ వ్యతిరేక శక్తులు, మతాచార పద్ధతుల కారణంగా ప్రాచీన వేద, ధర్మాలు తుడిచిపెట్టుకుపోయే ప్రమాదం ఏర్పడినప్పుడు.. వాటిని తట్టుకునేందుకు వేద, ధర్మ పరిరక్షణకు శ్రీ ఆదిశంకరాచార్యులు నడుంబిగించారు. అసాధారణమైన యోగ శక్తితో కైలాసంలో పరమేశ్వరుడిని దర్శించుకుని, శివుడు ప్రసాదించిన ఐదు స్ఫటిక లింగాలతో భారతదేశంలో ఐదు చోట్ల పీఠాలను స్థాపించారని భక్తుల విశ్వాసం. ఆ ఐదు పీఠాల్లో.. శృంగేరి, పూరి, ద్వారకా, బదరీనాథ్ పీఠాల బాధ్యతలను శిష్యులకు అప్పగించి, కంచి పీఠానికి సర్వజ్ఞ పీఠాధిపతిగా ఉన్నారు. శతాబ్దాలుగా ఆ పరంపర కొనసాగుతోంది. క్రీస్తు పూర్వం 509లో ఈ పీఠం ఆవిర్భవించినట్లు చరిత్ర చెబుతోంది.
చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి హయాంలో కంచి పీఠం వేద సంరక్షణకు పలు చర్యలు చేపట్టింది. అందులో భాగంగా.. శిథిలావస్థలో ఉన్న ఎన్నో ప్రాచీన ఆలయాలకు మరమ్మతులు చేపట్టి పూజాదికార్యక్రమాలను పునరుద్ధరించారు. 1978లో శంకర జయంతి రోజున కాలడి వద్ద ‘కీర్తి స్తంభ’ పేరుతో ఒక స్థూపాన్ని స్థాపించారు. జయేంద్ర సరస్వతి స్వామి కూడా ఆ సంప్రదాయాల్ని కొనసాగించి దేశవ్యాప్తంగా ఎన్నో ఆలయాలను పునరుద్ధరించారు.
చెన్నైలోని కంచి కామకోటి చైల్డ్ ట్రస్టు ఆసుపత్రి సహా దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లోని కంచి కామకోటి పీఠం ఆసుపత్రులను ఎటువంటి ఇబ్బందులు లేకుండా నిర్వహించారు.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి