శబ్ద సంస్కృతి! అచ్యుతుని రాజ్యశ్రీ
 సప్త మాతృకలు శక్తులు బ్రాహ్మీ మాహేశ్వరి కౌమారి వైష్ణవి వారాహి ఇంద్రాణి చాముండా.
సప్త మృత్తికలు అశ్వశాల గోశాల  గజశాల తీర్ధం స్థానం రాజద్వారం గురుద్వారం నది నుంచి శాంతి పూజలకోసం మట్టిని తెస్తారు.
భారతదేశం జంబూ ద్వీపం లో ఉంది.పురాణాలప్రకారం పృథ్వి ఏడు భాగాలు గా ఉంది.జంబూ లక్ష ద్వీపం శాలభక్తి క్రౌంచ పుష్కర కుశ ద్వీపాలు  
సత్యకామ జాబాల అనే పిల్లాడు జాబాల అనే దాసీకి పుడతాడు."నాయనా!నీతండ్రి ఎవరో నాకే తెలీదు."అని అంటుంది. ఆపిల్లాడు విద్యకోసం గురువు
, దగ్గరకి వెళ్లి "నాకు తండ్రి కులం గోత్రం పేరు తెలీదు"అని చెప్పాడు.ఆపసివాడి నిజాయితీ కి ‌సంతోషించాడు గురువు.జాబాలిపురం అనే ఊరు క్రమంగా జబల్పూర్ ఐంది.
శప్తశతి కి తద్భవరూపం సతసయి.ఇందులో 700పద్యాలుంటాయి.ప్రాకృతభాషలో గాథాసప్తశతి సంస్కృతం లో ఆర్యాసప్తశతి హిందీ లో బిహారీ లాల్ రాసిన బిహారీ కీ సతసయీ ప్రసిద్ధి 🌹

కామెంట్‌లు