క్రీస్తు జననము. (మణిపూసలు);-మిట్టపల్లి పరశురాములు
కన్య మరియ గర్భమందు
పశుల శాల తొట్టియందు
జననమొందె రేడుమనకు
శాంతినివ్వవిశ్వమందు

ప్రేమ చూప క్రీస్తు నేడు
జగతి యందు వచ్చె జూడు
పాపములను పారదోల
పావనుడుగ వెలిగినాడు

అంధకారలోకమును
వెలుగుమయముచేయగను
జ్యోతిగానువెలిగినాడు
తేజరిల్లజేయగను

రోగములను బాపినాడు
వేద నంత బాపి నేడు
బాధలన్నితొలిగిపోవ
బాసటగనునిలచినాడు

నీళ్ళపైననడచినాడు
నీతిభో


దజేసినాడు
హృదయశుద్దిచేసిక్రీస్తు
దైవముగను వెలసినాడు

భక్తజనులుకూడినారు
భజనలెన్నొజేసినారు
ముక్తికోరిఆడిపాడి
పూజలెన్నొజేసినారు
              *

కామెంట్‌లు