అమ్మకెన్ని అగచాట్లు.... ! కోరాడ నరసింహా రావు.
 పుట్టినింట  అన్నదమ్ములతో 
సమానత్వమే  లేదు... !
 
అమ్మకు పనులన్నిటికీ  సాయ మైనావు !
     
అత్తవారింట ఆంక్షలతో... 
   నలిగిపోయావు... !
వేరుపడి...తాగుబోతుమగనితో
 కష్టాలనెన్నింటినో అనుభవిం చావు  !
      
పిల్లలకూ, నీకు  పొట్టకూటి కొరకు...ఇంటింటా....పాచిపను లు చేసి - చేసిఅలసిపోయావు !
     
కాయకష్టం ఇంక చేయలేక..
       కన్నబిడ్డ లెవరు తోడురాక 
   కాయగూరలు అమ్మి.... 
    .  కడుపు నింపుకొనగ...
         వీధి రోడ్డున నీవు... 
      చతికిల బడి నావా ... !!
    ఓర్పు - సహనమ్ములలో... 
        ధరిత్రులే మీరు !
    మీ ఆడజన్మల కెన్ని 
       అగచాట్లు తల్లీ..... !
          *****

కామెంట్‌లు